LOADING...
Gopi Galla Goa Trip : 'గోపి గాళ్ల గోవా ట్రిప్' ట్రైలర్ విడుదల - క్రేజీ జర్నీ స్టార్ట్!

Gopi Galla Goa Trip : 'గోపి గాళ్ల గోవా ట్రిప్' ట్రైలర్ విడుదల - క్రేజీ జర్నీ స్టార్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2025
02:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాస్తా ఫిల్మ్స్, ఔరాఉలిస్ ఆర్ట్స్, అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్, అవంతి సినిమా సంయుక్త వ్యవస్థాపనలో రూపొందుతున్న చిత్రం 'గోపి గాళ్ల గోవా ట్రిప్'. అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి కుమార్, సీతా రామరాజు, రమణా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రోహిత్ & శశి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ రోహిత్, శశి ఈ సినిమాను తీశిన తీరు చూసి మైండ్ బ్లాక్ అయింది.

Details

తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుంది

వీళ్ళకు అవసరమైతే ఎలాంటి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను. మరో దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ, రోహిత్, శశిని నేను చాలా ఏళ్లుగా తెలుసు. మొదట గోవాలోనే వాళ్లను కలిశాను. ఈ టైటిల్ విన్న వెంటనే ఆ రోజులు గుర్తొచ్చాయి. వీళ్లు చేసిన ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ నాకు నచ్చాయన్నారు. దర్శకులు రోహిత్ & శశి మాట్లాడుతూ ఇది ఓ క్రేజీ సినిమా. మేము షార్ట్ ఫిల్మ్స్ చేయడం అలవాటున్న వాళ్లం. ఇది రోడ్ ట్రావెల్ ఫిల్మ్. మా నిర్మాత సాయి ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారని చెప్పారు. నిర్మాత సాయి కుమార్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులకు ఇది కొత్త అనుభవం కానుందని తెలిపారు.