Prabhas -Virat Raj: ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో..ప్రభాస్ కజిన్ విరాట్ రాజ్ తెరంగేట్రం
రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ టాలీవుడ్ లో ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. బాహుబలితో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ స్థాయికి వెళ్లారు. తాజాగా ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ప్రభాస్ కజిన్ విరాట్ రాజ్ హీరోగా చేస్తున్న సినిమా షూటింగ్ బుధవారం హైదరాబాద్లో ముహుర్తం షాట్ జరుపుకుంది. డాన్స్ కొరియాగ్రాఫర్ గణేశ్ మాస్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ముహుర్తం షాట్ కు దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు. డాన్స్ మాస్టర్ నుంచి మెగాఫోన్ పట్టుకుని గణేష్ మాస్టర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం పేరు 'గౌడ్ సాబ్'.
బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది: సుకుమార్
మల్లీశ్వరీ సమర్పణలో శ్రీపాద ఫిలింస్ బేనర్ పై ఎస్సార్ కల్యాణమండపంరాజు,కె.వెంకట రమణ, కాటారి సాయికృష్ణ కార్తీక్ లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముహుర్తం షాట్ చిత్రీకరణ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ....గౌడ్ సాబ్ సినిమా కథ తనకు బాగా నచ్చిందని చెప్పారు. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్నారు. గణేశ్ మాస్టర్, విరాట్ రాజ్ లకు సుకుమార్ అభినందనలు తెలిపారు. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ వరుసగా సాహో, రామాయణ్, రాధేశ్యామ్, సలార్ లాంటి సినిమాల్ని తీసి బాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించారు. ఇప్పుడు ప్రెస్టేజియస్ ప్రాజెక్టు సలార్ 2, కల్కి, సందీప్ వంగ రూపొందిస్తున్న స్పిరిట్ సినిమాలతో ప్రభాస్ క్యూలో ఉన్నారు.