LOADING...
Gouri Kishan: మీ బరువు ఎంత?: విలేఖరి ప్రశ్నపై మండిపడిన నటి
మీ బరువు ఎంత?: విలేఖరి ప్రశ్నపై మండిపడిన నటి

Gouri Kishan: మీ బరువు ఎంత?: విలేఖరి ప్రశ్నపై మండిపడిన నటి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2025
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

నటి గౌరీ కిషన్‌కు (Gouri Kishan) తాజాగా చేదు అనుభవం ఎదురైంది. తన తాజా చిత్రం 'అదర్స్‌' ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో, ఒక జర్నలిస్ట్ ఆమెను ఇబ్బందికర ప్రశ్న (Body Shaming) వేశారు. మొదట గౌరీ ఆ ప్రశ్నకు ఓర్పుతో స్పందించినప్పటికీ, ఆ రిపోర్టర్‌ ఆ ప్రశ్నను సమర్థించుకోవడంతో , ఆమె స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ విషయంపై నెటిజన్లు గౌరీకి ప్రశంసలు అందిస్తున్నారు. ప్రస్తుతం గౌరీ తమిళ సినీ పరిశ్రమలో వరుస ప్రాజెక్టులతో సాగుతున్నారు. అబిన్ హరికరణ్‌ దర్శకత్వంలో రూపొందిన ఆమె తాజా సినిమా 'అదర్స్‌' ప్రమోషన్ కోసం జరిగిన ప్రెస్ మీట్‌లో,ఒక రిపోర్టర్,"మీ బరువు ఎంత?"అని ప్రశ్నించాడు.

వివరాలు 

నా బరువు తెలుసుకొని మీరు ఏం చేస్తారు?

అంతేకాకుండా, గతంలో కొంతమంది స్టార్ నటీమణులు కూడా ఈ రకమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని చెప్పి తన ప్రశ్నను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో గౌరీ ఘాటుగా స్పందించారు. "నా బరువు గురించి తెలుసుకొని మీకేమి ప్రయోజనం? నా శరీరాకారంతో ఈ సినిమాలో ఏమైనా సమస్య ఏర్పడిందా? ప్రతి మహిళ శరీరం వేరుగా ఉంటుంది. నన్ను నా నటన, నేను చేసిన పాత్రలు, సినిమాల ద్వారా అంచనా వేయండి. అవే నేను ఎవరో చెబుతాయి." అని స్పష్టంగా చెప్పారు.

వివరాలు 

ఇది నిజమైన జర్నలిజం కాదు

"నా పాత్ర గురించి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. అందరి ఆసక్తి నా బరువుపైనే? ఇది ఎంత అర్ధంలేని ప్రస్నో తెలుసా? ఇదే ప్రశ్నను మీరు ఎప్పుడైన పురుష హీరోలను అడుగుతారా? ఇది జర్నలిజం స్థాయిని తగ్గించే విషయం. ఇలాంటి ప్రశ్నలు అడిగి మీ వృత్తిని కించపరచకండి. ప్రెస్ మీట్‌లో నేను ఒక్క మహిళగా ఉన్నందుకే ఇలాంటి ప్రశ్నలు వస్తాయా?" అని అభ్యంతరం వ్యక్తం చేశారు.

Advertisement

వివరాలు 

'జాను'లో త్రిష చిన్నప్పటి  పాత్ర

ఇదిలా ఉండగా, ఈ సంఘటన సమయంలో ఆమెతో ఉన్న నటుడు ఆదిత్య మాధవన్‌ మౌనం పాటించడం పై కూడా విమర్శలు వచ్చాయి. తాజాగా ఆయన దీనిపై స్పందిస్తూ.. "నేను మాట్లాడకపోవడం అంటే ఆ ప్రశ్నను సమర్ధించానని కాదు. ఆ సమయంలో ఎలా స్పందించాలో అర్థం కాలేదు. అలాంటి ప్రశ్నలు అడగడం తగదు. నేను వెంటనే ఆ మాటను ఖండించాల్సింది." అని తప్పును అంగీకరించారు. తెలుగు ప్రేక్షకులకు గౌరీ కిషన్‌ సుపరిచితమే. '96' చిత్రంలో త్రిష చిన్నప్పటి పాత్రను పోషించిన ఆమె, అదే సినిమా రీమేక్‌గా వచ్చిన 'జాను' లో కూడా అదే పాత్రలో నటించారు.

Advertisement