గ్రామీ అవార్డ్స్ చరిత్ర, ప్రత్యేకత, ఈ సంవత్సరం నామినేషన్లు, ఎక్కడ చూడవచ్చో తెలుసుకోండి
65వ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం భారతదేశ కాలమానం ప్రకారం ఫిబ్రవరి 6వ తేదీన ఉదయం 6:30గంటలకు అందజేయబడతాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ బుధవారమే మొదలైంది. చరిత్ర గ్రామీ అవార్డ్స్ కేవలం సంగీతానికి సంబంధించినవి మాత్రమే. ఇందులో అనేక క్యాటగిరీస్ ఉన్నా కూడా అవన్నీ సంగీతానికి సంబంధించినవే. 1959లో మొదటిసారిగా గ్రామీ అవార్డులను అందించారు. అప్పట్లో వీటిని గ్రామఫోన్ అవార్డ్స్ అని పిలిచేవారు. గ్రామఫోన్ అనేది సంగీత సాధనం. ఐపాడ్ మాదిరిగా దీని ద్వారా సంగీతం వినవచ్చు. గ్రామీ అవార్డులకు నామినేషన్స్ ఉంటాయి. రికార్డింగ్ అకాడమీ వారు ఈ గ్రామీ అవార్డులను అందజేస్తారు. అమెరికాలో అత్యంత పేరున్న నాలుగు అవార్డుల్లో అకాడమీ అవార్డ్స్, ఎమ్మీ అవార్డ్స్, టోనీ అవార్డుల్లో గ్రామీ కూడా ఒకటి.
గ్రామీ అవార్డుల ప్రధానోత్సవాన్ని ఎక్కడ చూడాలి
గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్ లోని క్రిప్టో.కామ్ ఏరీనా లో జరగనుంది. అంతకుముందు కోవిడ్ 19 భయాల వల్ల లాస్ వేగాస్ లోని ఎమ్జీఎమ్ గ్రాండ్ గార్డెన్ ఏరీనాలో జరిగింది. 65వ గ్రామీ అవార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమంలో క్రిప్టో.కామ్ ఎరీనాలో హ్యారీ స్టైల్స్ పర్ఫామ్ చేయనున్నారు. అలాగే బ్యాడ్ బన్నీ, బ్రాండీ కార్లీ, లిజ్జ, స్టీవ్ లేసీ ఇంకా చాలామంది పర్ఫామ్ చేయనున్నారు. అనౌష్క శంకర్, అరూజ్ అఫ్తాబ్ ఇద్దరూ కలిసి గ్రామీకి నామినేట్ అయిన తమ పాటను పాడనున్నారు. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫామెన్స్ విభాగంలో వీరిద్దరూ నామినేట్ అయ్యారు. గ్రామీ అవార్డుల ప్రదానోత్సవాన్ని యూట్యూబ్ టీవీ, హులు ద్వారా ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు