Peddhi: 'పెద్ది' ప్రీమియర్ షోలకు గ్రీన్ సిగ్నల్.. స్పెషల్ షో టికెట్ ధర రూ.600
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'పెద్ది' సినిమాకు టికెట్ ధరల పెంపుతో పాటు స్పెషల్ ప్రీమియర్ షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ అనుమతితో జూన్ 3 రాత్రి 8 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షో ప్రదర్శించనున్నారు. ఈ స్పెషల్ షోకు ఒక్కో టికెట్ ధర జీఎస్‌టితో కలిపి రూ.600గా నిర్ణయించారు.
వివరాలు
ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి
అలాగే సినిమా విడుదలైన తేదీ నుంచి 4 నుంచి 10 రోజుల పాటు సాధారణ టికెట్ ధరలపై అదనపు ధరలు వసూలు చేసుకునేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.100 అదనంగా, మల్టీప్లెక్స్‌లలో రూ.125 చొప్పున పెంచుకునే అవకాశం కల్పించారు. ఇవి మాత్రమే కాకుండా, రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా థియేటర్లకు అనుమతి మంజూరు చేశారు. దీంతో 'పెద్ది' విడుదల సందర్భంగా అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.