LOADING...
Venky77 : వెంకీ మామ - త్రివిక్రమ్ కాంబోకి గ్రీన్ సిగ్నల్.. రిలీజ్‌ ఎప్పుడంటే?
వెంకీ మామ - త్రివిక్రమ్ కాంబోకి గ్రీన్ సిగ్నల్.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Venky77 : వెంకీ మామ - త్రివిక్రమ్ కాంబోకి గ్రీన్ సిగ్నల్.. రిలీజ్‌ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2025
03:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

విక్టరీ వెంకటేష్‌ హీరోగా, సెన్సేషనల్‌ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సంక్రాంతికి వచ్చిన సినిమాతో సూపర్‌ సక్సెస్‌ అందుకున్న వెంకీ, ఇప్పుడు త్రివిక్రమ్‌తో జత కట్టారు. గతంలో వెంకీ కెరీర్‌లో హిట్‌ అయిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్‌ మాటల రచయితగా పని చేశారు. ఇప్పుడు తొలిసారిగా ఆయనను డైరెక్ట్‌ చేస్తున్నారు. ఎప్పటినుంచో వెంకీ-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా రావాలనుకున్న ఫ్యాన్స్‌ కోరిక చివరికి నెరవేరింది. అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు, త్రివిక్రమ్‌ స్టైల్‌ కామెడీ, పంచ్‌లతో కూడిన కథా-కథనాలతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

Details

సమ్మర్ కానుకగా రిలీజ్

ఈ రోజు ఉదయం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వెంకటేష్‌, త్రివిక్రమ్‌, సురేష్‌ బాబు, నాగవంశీ, సూర్యదేవర చినబాబు హాజరయ్యారు. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర చినబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'వెంకటరమణ' అనే టైటిల్‌ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించి, చకచకా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ భావిస్తున్నారు. వెంకీ-త్రివిక్రమ్‌ కాంబో నుండి ఆశించే క్లీన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో హంగామా సృష్టిస్తుందో చూడాలి. హీరోయిన్‌తో పాటు మిగతా టెక్నీషియన్స్‌ వివరాలను త్వరలో వెల్లడించనున్నట్టు మేకర్స్‌ తెలిపారు.