LOADING...
Rashmika Mandhana: మాస్క్‌ తీయలేను గైస్‌..! ఫేస్‌ ట్రీట్‌మెంట్‌తో రష్మిక న్యూ లుక్‌ వైరల్
మాస్క్‌ తీయలేను గైస్‌..! ఫేస్‌ ట్రీట్‌మెంట్‌తో రష్మిక న్యూ లుక్‌ వైరల్

Rashmika Mandhana: మాస్క్‌ తీయలేను గైస్‌..! ఫేస్‌ ట్రీట్‌మెంట్‌తో రష్మిక న్యూ లుక్‌ వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 27, 2025
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

సినీ పరిశ్రమ అంటే గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందం, ఆకర్షణ, లుక్స్‌ అన్నీ కెరీర్‌ను ప్రభావితం చేసే అంశాలే. ముఖ్యంగా హీరోయిన్‌లకు అయితే ఇవి మరింత ప్రాధాన్యంగా ఉంటాయి. అందుకే చాలా మంది నటి మణులు ఫిట్‌గా, అందంగా కనిపించేందుకు కఠినమైన డైట్‌లు పాటిస్తూ, వ్యాయామం, యోగా, బ్యూటీ ట్రీట్‌మెంట్‌లు చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఈ జాబితాలో నేషనల్ క్రష్‌గా పేరు గాంచిన రష్మిక మందన్న కూడా చేరింది. ఇటీవల రష్మిక ఎయిర్‌పోర్ట్‌లో కనిపించగా, ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కారణం ఆమె ముఖంపై ధరించిన బ్లాక్ మాస్క్. సాధారణంగా సెలబ్రిటీలు ఎయిర్‌పోర్ట్‌లో ఫోటోగ్రాఫర్ల కోసం కొద్దిసేపు మాస్క్ తీసి పోజులు ఇస్తారు.

Details

ఫేస్ ట్రీట్‌మెంట్ అయ్యింది

కానీ ఈసారి రష్మిక మాత్రం అలా చేయలేదు. 'ది గర్ల్‌ఫ్రెండ్‌' సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ కోసం హైదరాబాద్‌కి వచ్చిన రష్మిక, ఎయిర్‌పోర్ట్‌లో బ్లాక్ అవుట్‌ఫిట్‌తో, బ్లాక్ మాస్క్‌తో చాలా సింపుల్‌గా కనిపించింది. అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లు, అభిమానులు మాస్క్ తీయండి మేడమ్‌, ఒక ఫోటో ప్లీజ్‌!" అని అడిగితే, రష్మిక నవ్వుతూ ఫేస్ ట్రీట్‌మెంట్ అయ్యింది గైస్‌, తీయలేను అని సమాధానమిచ్చింది. ఆమె ఆ ఒక్క మాటతోనే సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. రష్మిక ముఖానికి ఏమైంది?, ఏ ట్రీట్‌మెంట్ చేయించుకుందో?, లిప్ ఫిల్లర్ వేసుకుందా? అంటూ నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు.

Details

రష్మిక లుక్ లో కొద్దిగా మార్పులు

ఇటీవల రష్మిక కొత్త ఫోటోలు, వీడియోల్లో ఆమె లుక్‌లో కొద్దిగా మార్పులు కనిపిస్తున్నాయని అభిమానులు చెబుతున్నారు. ముఖ్యంగా లిప్స్‌ దగ్గర స్వల్పంగా ఉబ్బినట్లు కనిపిస్తోందని, బ్యూటీ ఎన్‌హాన్స్‌మెంట్ ట్రీట్‌మెంట్ చేయించుకుందేమో అని సోషల్‌ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే, కొంతమంది అభిమానులు మాత్రం రష్మికను సమర్థిస్తున్నారు. రష్మిక సహజంగా చాలా అందంగా ఉంటుందని, ఇలాంటి ట్రీట్‌మెంట్‌ల అవసరం లేదని కొందరు రాసుకొచ్చారు. బహుశా పెళ్లికి ముందు కొత్త లుక్ కోసం ఇలా చేసుకుందేమో అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.