
Halagali : తెలుగు ప్రేక్షకుల కోసం గ్రేట్ హిస్టారికల్ మూవీ 'హలగలి'
ఈ వార్తాకథనం ఏంటి
ట్యాలెంటెడ్ హీరో డాలీ ధనంజయ, సప్తమి గౌడ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న హిస్టారికల్ ప్రాజెక్ట్ 'హలగలి' రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుకేష్ నాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కళ్యాణ్ చక్రవర్తి ధూళిపల్ల నిర్మిస్తుండగా, యార్లగడ్డ లక్ష్మీ శ్రీనివాస్ సమర్పిస్తున్నారు. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ మల్టీలింగ్వల్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను గ్రాండ్ ప్రెస్ మీట్‌లో మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ధనంజయ్‌ను కమాండింగ్ అవతార్‌లో చూపించడం గణనీయమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ప్రెస్ మీట్‌లో హీరో డాలీ ధనంజయ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. హలగలి అనేది ఒక అన్‌టోల్డ్ స్టోరీ.
Details
ఈ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ ను ఇస్తుంది
ఈ సినిమాలో భాగమవ్వడం నాకు గర్వకారణం. హలగలి కర్ణాటక ప్రజలకు గొప్ప ఎమోషన్. నిర్మాత కళ్యాణ్, డైరెక్టర్ సుకేష్ చాలా ప్యాషన్‌తో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. కథ వినగానే ఇందులో తప్పకుండా భాగమవ్వాలనే ఆలోచన కలిగింది. గ్లింప్స్ అందరికీ నచ్చడం సంతోషంగా ఉంది. త్వరలోనే మరిన్ని క్రేజీ అప్డేట్స్ రాబోతున్నాయి. ఈ సినిమా తప్పకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అందరి అంచనాలను అందుకుంటుందని నమ్ముతున్నాను. మీ అందరి సపోర్ట్‌కు థాంక్యూ. హలగలి ఒక మెమరబుల్ ప్రాజెక్ట్ అవుతుందని అన్నారు.
Details
ధనంజయతో ఇది నా రెండో సినిమా
అలాగే హీరోయిన్ సప్తమి గౌడ మాట్లాడుతూ ఈ సినిమా చేయడం నాకు గొప్ప అదృష్టం. హలగలి చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. త్వరలోనే నా క్యారెక్టర్ గ్లింప్స్ రిలీజ్ కానుంది. ఇందులో నేను చాలా మాస్ క్యారెక్టర్ చేశాను. ఇది మన నేల కథ. డైరెక్టర్ అద్భుతంగా రాశారు. చాలా బిగ్ స్కేల్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సెట్స్ చాలా గ్రాండ్‌గా ఉంటాయి. ధనంజయ గారితో ఇది నా రెండో సినిమా. ఆయనతో స్క్రీన్ షేర్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు.