Page Loader
Abir Gulal: పహల్గామ్ దాడి ఎఫెక్ట్.. బాలీవుడ్‌లో ఆ మూవీ బ్యాన్!
పహల్గామ్ దాడి ఎఫెక్ట్.. బాలీవుడ్‌లో ఆ మూవీ బ్యాన్!

Abir Gulal: పహల్గామ్ దాడి ఎఫెక్ట్.. బాలీవుడ్‌లో ఆ మూవీ బ్యాన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 23, 2025
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈ దాడిలో 28 మందికి పైగా అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన యావత్ భారతదేశాన్ని కలిచివేస్తోంది. ప్రకృతి అందాల కోసం పహల్గామ్‌ను సందర్శించిన పర్యాటకులపై ఉగ్రవాదులు మతపరంగా లక్ష్యంగా చేసుకొని దాడిచేయడం పట్ల ప్రతి భారతీయుడూ ఆగ్రహావేశంతో ఉవ్వెత్తున రగిలిపోతున్నారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ మద్దతు ఉందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు సంబంధించి ఉన్న అనేక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రభావం ఇప్పుడు మే 9న విడుదలకానున్న 'అబీర్ గులాల్' అనే పాకిస్తానీ నటుడు నటించిన సినిమాపై పడింది.

Details

#BanAbirGulaal లాంటి హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్

పాకిస్తానీ నటుడు ఫవర్ ఖాన్ హీరోగా, వాణి కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా తాజాగా ట్రైలర్‌తో ఆకర్షించింది. కానీ ఉగ్రదాడి నేపథ్యంలో, ఫవర్ ఖాన్ ఉన్నాడన్న కారణంతో సినిమాపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో వినియోగదారులు #BanAbirGulaal లాంటి హ్యాష్‌ట్యాగులతో సినిమాను విడుదల కాకుండా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఆర్తి ఎస్. బాగ్ది దర్శకురాలు కాగా, ఇది ఒక రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్‌గా రూపొందింది. ఇప్పటికే బాలీవుడ్‌లో ఫవర్ ఖాన్ కొత్త విషయం కాదు. 2014లో ఖూబ్సూరత్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆయన, 2016లో కపూర్ అండ్ సన్స్, ఏ దిల్ హై ముష్కిల్ వంటి సినిమాల్లో నటించారు.

Details

సినిమా వాయిదా వేసే అవకాశం

అనంతరం పాకిస్తాన్‌లోనే కొనసాగి, అబీర్ గులాల్ ద్వారా బాలీవుడ్‌కి రీ-ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. అయితే తాజా ఘటనల నేపథ్యంలో, ఫవర్ ఖాన్ స్పందించకపోతే, అతని పట్ల వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమాను వాయిదా వేసే అవకాశం కూడా ఉందని సమాచారం. చిత్రయూనిట్ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.