
Hansika Guardian: ఓటీటీలోకి వచ్చేసిన హన్సిక మోత్వానీ హారర్ థ్రిల్లర్ 'గార్డియన్'
ఈ వార్తాకథనం ఏంటి
'దేశముదురు' ఫేమ్ హన్సిక నటించిన తాజా చిత్రం 'గార్డియన్' (Hansika Guardian) ఇటీవల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శ
బరి గురు శరవణన్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ, 2024 మార్చి 8న తమిళంలో విడుదలై అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
తొలుత తమిళంలో మాత్రమే స్ట్రీమింగ్ అయిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోకి కూడా వచ్చేసింది.
ప్రఖ్యాత ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో ప్రస్తుతం ఈ సినిమా తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది.
భవాని మీడియా ద్వారా ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొచ్చారు. సంగీత దర్శకుడు సామ్ సి.ఎస్. ఈ సినిమాకు వెన్నుదన్నుగా నిలిచే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించగా, కెమెరా పని కె.ఏ. శక్తివేల్ చేపట్టారు.
వివరాలు
కథ సారాంశం:
ఈ కథ నాయిక అపర్ణ (హన్సిక) చుట్టూ తిరుగుతుంది. ఆమె జీవితమంతా దురదృష్టం వెంబడిస్తూనే ఉంటుంది.
చిన్నప్పటి నుంచి ఏదైనా కోరుకుంటే, అది నెరవేరదు. దేవుడి హారతి తీసుకోవాలన్న కూడా అపర్ణ చేతులు జోడించగానే దీపం ఆరిపోతుంది.
ఆమె ప్రేమ కూడా విఫలమై ముగుస్తుంది. దీంతో అందరూ ఆమెను "అన్‌లక్కీ అపర్ణ"గా పిలవడం ప్రారంభిస్తారు.
ఒక ప్రాజెక్ట్ పనిలో భాగంగా అపర్ణ ఓ నిర్మాణ పనుల బిల్డింగ్ వద్దకు వెళ్లి, అక్కడ ఓ ప్రత్యేకమైన క్రిస్టల్ రాయిని (మెరిసే రత్నం) కనుగొంటుంది.
ఈ రాయిని తన వద్ద ఉంచుకున్న తర్వాత, అపర్ణ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆమె కోరే ప్రతిదీ జరగడం మొదలవుతుంది.
వివరాలు
కథ సారాంశం:
ఈ సమయంలో ఆమెకు 'కే' అనే పెద్ద నిర్మాణ సంస్థలో ఉద్యోగం లభిస్తుంది.
అంతేకాదు,అప్పుడెప్పుడో దూరమైన తన మాజీ ప్రియుడు ప్రభ కూడా అదే కంపెనీలో తిరిగి ఆమెను కలుస్తాడు.
ఇద్దరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోతూ,ప్రేమ మళ్లీ చిగురిస్తుంది.
అయితే సమస్యలు అక్కడితో ఆగవు. ఆ సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్‌తో పాటు కంపెనీ అధిపతి తమ్ముడు ఇద్దరూ ఉద్యోగులపై దాడులు చేస్తూ వేధింపులకు పాల్పడతారు.
వారివల్ల అపర్ణతో పాటు మిగిలిన ఉద్యోగులందరూ ఇబ్బందులు పడుతుంటారు. ఆ ఇద్దరూ చనిపోతే మంచిదని అపర్ణ మనసులో భావిస్తుంది.
ఆలోచన చేసినట్లుగానే,వారు ఇద్దరూ ఆమె కళ్ల ముందే భయంకరంగా ప్రాణాలు కోల్పోతారు.
అప్పటి నుంచి అపర్ణ కోరే ప్రతీ కోరిక ఏదోఒక రీతిలో నెరవేరుతోంది.
వివరాలు
మీరా కూతురికి గార్డియన్‌గా మారడానికి అపర్ణ అంగీకరించిందా లేదా?
ఇది చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. ఈ శక్తులకు మూలం ఏమిటి? ఆ కోరికలకు ఆ క్రిస్టల్‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఆ క్రిస్టల్‌లో బంధించబడిన మీరా అనే ఆత్మ ఎవరు?
గౌతమ్,త్యాగు,వారి మరో ఇద్దరు స్నేహితులపై మీరా పగతో రగిలిపోవడానికి కారణం ఏమిటి? మీరా ఎలా చనిపోయింది?
ఆమెకు ఏం జరిగింది? ఎవరి వల్ల చనిపోయింది? ఈ అన్యాయానికి ప్రతీకారం తీర్చడంలో అపర్ణ మీరాకు సహాయం చేస్తుందా?
చివరికి, మీరా కూతురికి గార్డియన్‌గా మారడానికి అపర్ణ అంగీకరించిందా లేదా అన్నదే ఈ చిత్ర కథలో మిగిలే మలుపు.