Page Loader
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ.. అద్భుతమైన ఆఫర్ తో టీమ్ హను-మాన్  
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ.. అద్భుతమైన ఆఫర్ తో టీమ్ హను-మాన్

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ.. అద్భుతమైన ఆఫర్ తో టీమ్ హను-మాన్  

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2024
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా రోజు రానే వచ్చింది. ఈ చారిత్రాత్మక సందర్భం దృష్ట్యా, హను-మాన్ బృందం ఓ సూపర్ ఆఫర్ ను ప్రకటించింది. శ్రీరాముడు పునరాగమనాన్ని పురస్కరించుకుని, యుఎస్ డిస్ట్రిబ్యూటర్లు ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వాణ సినిమాస్ 11కి పైగా లొకేషన్‌లలో సినీ ప్రేక్షకుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. తేజ సజ్జా,అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హీరో చిత్రాన్ని ప్రేక్షకులు సాధారణ ధర కంటే సగం ధరకి ఇవ్వ‌నున్న‌ట్లు వెల్లడించింది.

Details 

ఈ ఆఫర్ తో థియేటర్స్ కి భారీగా జనాలు 

అది కూడా ఈ కూడా ఈ రోజు (జనవరి 22, 2024) మాత్రమే వర్తిస్తుంది. ఇక ఈ ఆఫర్ తో థియేటర్స్ కి జనాలు భారీగా తరలివచ్చే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే హను-మాన్ కి మరిన్ని లాభాలు రావడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంగీతం అందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్