
Hanu-man: హను-మాన్ ప్రీమియర్ షో: కలెక్షన్స్ అదుర్స్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ్జ సజ్జ హీరోగా వచ్చిన హను-మాన్ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాకు గురువారం పెయిడ్ ప్రీమియర్స్ వేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రీమియర్స్ ద్వారా హను-మాన్సినిమా కేవలం నైజాంలోనే రూ.2.55 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
హను-మాన్ లాంటి చిన్న బడ్జెట్ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే రికార్డనే చెప్పాలి.
మొదటి పోస్టర్ నుంచి సూపర్ బజ్ క్రియేట్ చేసుకున్న హను-మాన్ మూవీని మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఫీల్ వచ్చేలా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
Details
కంటెంట్ స్ట్రాంగ్.. సినిమాకి ప్లస్
రెండు తెలుగు రాష్ట్రాల్లో హను-మాన్ మూవీని సుమారు 200 స్క్రీన్లలో ప్రీమియర్ షోలు ప్రదర్శించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో 37, వైజాగ్‌లో 27, గుంటూరులో 10, నెల్లూరులో 8, రాజమండ్రిలో 4 ఇలా షోలు ప్లాన్ చేసినట్లు సమాచారం.
ఈ షోలను గురువారం సాయంత్రం 6.15 గంటలకు మొదలైంది. ఇక ఈ ప్రీమియర్ షోల టికెట్ బుకింగ్స్ ఆన్‌లైన్‌లో పెట్టడంతో గంటల్లోనే 165 షోలలో ఫుల్ టికెట్స్ అమ్ముడుపోయి హౌజ్ ఫుల్ అయినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో కంటెంట్ కూడా స్ట్రాంగ్ గా ఉండడం ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది.