Page Loader
Hanu-Man: ఓటిటిలో అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ హను-మాన్ 
ఓటిటిలో అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ హను-మాన్

Hanu-Man: ఓటిటిలో అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ హను-మాన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 18, 2024
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఎడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యిన హను-మాన్ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా దాదాపు 66 రోజుల తర్వాత Zee 5 యాప్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ధియేటర్లలో దుమ్ముదులిపిన ఈ సినిమా ఓటిటిలో కూడా అదే రేంజ్ వ్యూయర్ షిప్ తో దూసుకుపోతోంది. కేవలం 11 గంటల్లోనే, చలనచిత్రం 102 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు అయ్యి, ZEE5లో మునుపటి అన్ని రికార్డులను బద్దలు కొట్టి, ప్రపంచ నంబర్ 1 ట్రెండింగ్ స్పాట్‌ను క్లెయిమ్ చేసింది. ఇక ఆ సంఖ్య సమయం పెరుగుతున్న కొద్దీ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Details 

హను-మాన్ హిందీ వెర్షన్‌ జియో సినిమాలో..

తేజ సజ్జ, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను, కమెడియన్ సత్య వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్‌ల మ్యూజిక్ అందించారు. ప్రేక్షకులు సినిమా హిందీ వెర్షన్‌ను జియో సినిమాలో ప్రసారం చేయవచ్చు. ZEE5 ఇంకా తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్‌లను విడుదల చేయలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జీ5 తెలుగు లో హను-మాన్