Mahakali: తొలి మహిళా సూపర్ హీరో చిత్రం 'మహకాళి'.. ప్రశాంత్ వర్మ క్రేజీ అనౌన్స్‌మెంట్
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'హను-మాన్' సినిమాతో దేశ వ్యాప్తంగా అద్భుత గుర్తింపు సాధించారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన తొలి చిత్రమే, ప్రేక్షకులను కనీవినీ ఎరుగని రీతిలో ఆకట్టుకుంది.
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ విజయంతో PVCU ద్వారా 12 సూపర్ హీరోస్ సినిమాలను తెరకెక్కించనున్నట్లు ఆయన ప్రకటించారు.
అందులో భాగంగా మూడో సినిమాను కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు 'మహాకాళి' అనే పేరు నిర్ణయించారు.
వివరాలు
ప్రతిష్టాత్మక చిత్రాన్ని రూపొందించబోతున్న లేడీ డైరెక్టర్
'మహాకాళి' సినిమాను ఆర్‌కెడి స్టూడియోస్ పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. మోషన్ పిక్చర్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, అక్విజిషన్ కంపెనీగా ఆర్‌కెడి స్టూడియోస్ ఈ సినిమాతో నిర్మాణంలోకి అడుగుపెడుతోంది.
ప్రతిష్టాత్మక చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
ఈ సినిమాకు లేడీ డైరెక్టర్ పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రూపొందించబోయే లేడీ సూపర్ హీరో మూవీ 'మహాకాళి' అని మేకర్స్ ప్రకటించారు.
వివరాలు
సినిమాపై అంచనాలు పెంచుతున్న టైటిల్ పోస్టర్
'మహాకాళి' సినిమా బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాల ఆధారంగా రూపొందనుందని మేకర్స్ తెలిపారు.
ఈ సినిమాలో మహాకాళి అమ్మవారి చుట్టూ అల్లుకున్న కథతో రూపొందనుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది.
ఒక అమ్మాయి తన తలను పులి తలకు ప్రేమగా తాకుతున్నట్లు చూపించారు. బ్యాగ్రౌండ్‌లో గుడిసెలు, జాయింట్ వీల్ మంటల్లో కాలిపోతున్నట్లు చూపించారు, దీనిని చూసి జనాలు భయంతో పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తున్నాయి.
ఇదంతా ఓ జాతర దగ్గర జరుగుతున్నట్లు అర్థమవుతోంది. బెంగాలీ ఫాంట్‌లో డిజైన్ చేసిన టైటిల్ పోస్టర్ మధ్యలో డైమండ్ లాంటి రూపాన్ని చూపించారు. ఈ పోస్టర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్
On this auspicious occasion of Navratri, I’m thrilled to share something very special. Together with @RKDStudios, we proudly present the tale of an invincible warrior, the protector of the righteous, and the ultimate destroyer of evil 🔥
— Prasanth Varma (@PrasanthVarma) October 10, 2024
From the universe of #HanuMan ❤️🔥, prepare… pic.twitter.com/hDP8pFX9PE