Hanu-Man: ఓటిటి డేట్ ని లాక్ చేసుకున్న 'హను-మాన్'.. ఎప్పుడంటే.. ?
సంక్రాంతి బ్లాక్‌బస్టర్ "హను-మాన్" ఎట్టకేలకు ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 వేదికగా ఈ చిత్రం మహా శివరాత్రి కానుకగా మార్చి 08 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ఎక్స్‌లో ప్రకటించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించారు. థియేటర్లలో అఖండ విజయాన్ని సాధించిన ఈ సూపర్ హీరో చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన "హనుమాన్" బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి, రికార్డులను బద్దలు కొట్టి, 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి, వినయ్ రాయ్ కీలక పాత్రలలో నటించారు.
సీక్వెల్‌గా 'జై హనుమాన్'
ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి నిర్మించారు. కాగా, ఈ సినిమాకు సీక్వెల్‌గా 'జై హనుమాన్' రానున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రేక్షకులంతా సెకండ్ పార్ట్ 'జై హనుమాన్' కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది.