Page Loader
హనుమాన్ సినిమా విడుదల వాయిదా: మళ్ళీ రిలీజ్ ఎప్పుడంటే? 
హనుమాన్ సినిమా విడుదల వాయిదా

హనుమాన్ సినిమా విడుదల వాయిదా: మళ్ళీ రిలీజ్ ఎప్పుడంటే? 

వ్రాసిన వారు Sriram Pranateja
May 05, 2023
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

అ!, కల్కి, జాంబీ రెడ్డి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ హీరోగా హనుమాన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. హనుమాన్ టీజర్ విడుదలకు ముందు, ఈ చిత్రం గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియదు. టీజర్లో కనిపించిన దృశ్యాలు, యాక్షన్ సీన్లు, విజువల్స్ చూసిన వారందరూ హనుమాన్ సినిమాపై ఆసక్తి పెంచుకున్నారు. అందుకే ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని చూసారు. హనుమాన్ మేకర్స్ కూడా మే 12వ తేదీన రిలీజ్ చేస్తామని వెల్లడించారు. అయితే ప్రస్తుతం, హనుమాన్ సినిమాను మే 12న విడుదల చేయట్లేదట. మంచి సినిమాను మరింత క్వాలిటీతో ప్రేక్షకులను చూపించాలని ప్రయత్నం చేస్తున్నారట. అందుకే విడుదల ఆలస్యం కానుందట. మరికొన్ని రోజుల్లో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారట.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post