Hanu-Man: హను-మాన్ ఓటిటి విడుదల ఆలస్యం
చాలా కాలం తర్వాత, ఒక తెలుగు సినిమా థియేటర్లలో 50 రోజులు నడిచింది. అది సంక్రాంతి బ్లాక్ బస్టర్ హను-మాన్ . ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జా కీలక పాత్ర పోషించారు. గత కొన్ని రోజులుగా, ఈ సూపర్ హీరో చిత్రం మార్చి 8న ఓటిటి అరంగేట్రం చేస్తుందని బలమైన బజ్ ఉంది. ఈ విషయమై హనుమాన్ ఓటిటి విడుదలపై ఒక సోషల్ మీడియా వినియోగదారు "హనుమాన్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో కాస్త కన్ఫమ్ చేస్తారా" అని ఓ అభిమాని జీ5 (ZEE5)ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. దీనిపై జీ5 ఇండియా వెంటనే స్పందించింది.
ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూలు
"హాయ్. ఈ విషయంలో మాకు ఎలాంటి అప్డేట్ లేదు. దయచేసి మా వెబ్‌సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్ పై ఓ కన్నేసి ఉంచండి" అని జీ5 రిప్లై ఇచ్చింది. జీ5 ఇచ్చిన రిప్లైతో ఈ సినిమా కోసం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులను మరింత గందరగోళంలో పడేసినట్లైంది. ఇలాంటి సమయంలో జీ5 మూవీ డిజిటల్ ప్రీమియర్ పై సందేహాలు వ్యక్తం చేయడంతో అసలు హనుమాన్ వస్తుందా రాదా అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. డిజిటల్ హక్కులు కూడా భారీ మొత్తానికి అమ్ముడైనట్లు సమాచారం. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు.