
HBD Megastar Chiranjeevi: మెగా స్టార్ చిరంజీవి.. దశాబ్దాల అభిమాన మంత్రం
ఈ వార్తాకథనం ఏంటి
చిరంజీవి.. అంజనీ పుత్రుడు ఆంజనేయుడి పేరు. చిన్నపిల్లలకు పరిచయమయ్యే మొదటి దేవుడు. యాధృచ్ఛికమో, దైవ సంకల్పమో అదే పేరుతో సినిమాల్లోకి వచ్చాడో యువకుడు. ఆయనే 'చిరంజీవి'. ఫిల్మ్ కోర్స్ చేస్తున్నప్పుడు, ఒకసారి ఆయన కలల్లో వచ్చిన ఓ చిన్నారి "చిరంజీవి... చిరంజీవి... చిరంజీవి" అని పిలిచింది. ఈ కల గురించి చిరు తల్లికి వివరించగా, తల్లికి చెప్తే సినిమాల్లోకి వెళ్తున్నావు ఈ పేరే పెట్టుకోమని దేవుడు సూచించాడని తెలిపారు. అదేవిధంగా, ఆంజనేయుడి తల్లి అంజనాదేవి పేరు, చిరంజీవి తల్లి పేరు కూడా అనుకోకుండా ఒకటే కావడం యాద్ధృచ్చికం.
వివరాలు
చెప్తే కథ, రాస్తే పుస్తకం
చిన్నారుల నుండీ పెద్దవారు వరకూ అభిమానించే హీరో చిరంజీవి. తెలుగు ప్రేక్షకులకు 'కొణిదెల శివశంకరవర ప్రసాద్'గా పరిచయం అయిన ఆయన,పుట్టినరోజు నేడు. ఆగష్టు 22ని అభిమానులు పండుగగా భావిస్తారు. ప్రతి సంవత్సరం, ఈ రోజు అంగరంగ వైభవంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకల్ని సంబరంగా చేస్తారు అయన అభిమానులు. కానీ వారి ఆకలి తీరదు. మరునాడు..ఆగష్టు 23 నుంచే మళ్ళీ ఏడాది ఆగష్టు 22 కోసం ఎదురుచూస్తారు. హీరోగా అయినా సాధించిన స్థాయి అభిమానం,వాస్తవంగా దైవ సంకల్పమే. ఎందుకు చిరంజీవి అంత ఇష్టమంటే.. చెప్తే కథ, రాస్తే పుస్తకం అంటారు చాలామంది. 47 ఏళ్లుగా సినీపరిశ్రమలో ఆయన చూపిన మ్యాజిక్, తెలుగు సినిమా వైభవాన్ని మార్చి, 'హీరో' అనే పదానికి కొత్త నిర్వచనం ఇచ్చింది.
వివరాలు
హీరో ఫ్యాన్స్ సేవారూపంలో సమాజానికి ఉపయోగపడాలి
ప్రతిసినిమాలో కొత్తదనం చూపించే నమ్మకాన్ని ప్రేక్షకులకు ఇచ్చి,దానిని నిజం చేయడం ద్వారా దశాబ్దాలుగా నంబర్ వన్ హీరోగా నిలవడం సులభం కాదు. తెరపై చిరంజీవి చూపినప్పుడు,ప్రేక్షకుల మోముపై చిరునవ్వు రావాల్సిందే. వినోదాన్ని అందించడం మాత్రమే కాకుండా,వారి హృదయాలను గెలుచుకోవడం ఆయన ప్రత్యేకత. హీరో ఫ్యాన్స్ అనేవారు సేవారూపంలో సమాజానికి ఉపయోగపడేలా మలిచారు చిరంజీవి. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, గుజరాత్ భూకంపం,చెన్నై వరదలు,కేరళ విపత్తులు వంటి పరిణామాల్లో ఆయన అందించిన సాయం మనిషిగా ఆదుకోవడం ఆయనలోని గొప్ప గుణం. కళాకారుడిగా అలరించడం,మనిషిగా ఆదుకోవడం చిరంజీవి గుణాల్లో భాగం. తెలీని గుప్త దానాలకు కొదవే లేదు.తన కుటుంబాన్ని ముందుకు తీసుకురావడం,బంధాలను కలిపి ఉంచడం ఆయన నేర్పే మరో పాఠం.ప్రతి రంగంలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది
వివరాలు
తెలుగు సినిమాకు చిరంజీవి నామమే చిరునామా
కమర్షియల్ హీరోగా ఎదిగి, తెలుగు సినీ పరిశ్రమకు లెక్కలు మార్చాడు. ఒక దశలో దేశంలోనే అత్యధిక పారితోషికం అందిన నటుడిగా పేరు గడించారు. తెలుగు సినిమాకు చిరంజీవి నామమే చిరునామాగా మారింది. 'ఇది చిరంజీవి శకం' అనే వాక్యం, తెలుగు సినిమాపై ఆయన ముద్రను సాక్ష్యంగా నిర్ధారిస్తుంది. అందుకే చిరంజీవి యూనివర్శల్ హీరో. మహోన్నత వ్యక్తిత్వం ఆయనకు ప్రత్యేకం. ఆయన మార్గం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా ఉంటుంది. ఈ మహత్తర కీర్తిని అందుకున్న చిరంజీవి, మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ, ప్రేక్షకులకు మరింత వినోదం అందించాలి. హీరోగా మరిన్ని ఘనవిజయాలను సాధించాలి అనే ఆశయంతో, తెలుగు Newsbytes టీం తరఫున: "Happy Birthday Mega Star CHIRANJEEVI."