Haq Movie OTT: షా బానో కేస్ ఆధారంగా తెరకెక్కిన 'హక్' ఓటీటీ ఎంట్రీ.. రిలీజ్ డేట్, స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ఇమ్రాన్ హష్మీ, యామీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ కోర్టు డ్రామా 'హక్' (Haq) వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. థియేటర్లలో విడుదలైన సమయంలో ఈ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. కోర్టు నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేసే కథనంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికపై సందడి చేయడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.
Details
జనవరి 2 నుంచి స్ట్రీమింగ్
ఈ నేపథ్యంలో 2026 జనవరి 2 నుంచి 'హక్' స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. 1980లలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చారిత్రాత్మక 'షా బానో బేగమ్' కేసు ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఒక మహిళ తన హక్కుల కోసం భర్తపై సాగించిన న్యాయ పోరాటమే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఇమ్రాన్ హష్మీ లాయర్ పాత్రలో కనిపించగా, బాధితురాలిగా యామీ గౌతమ్ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. షీబా చడ్డా మరో కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించారు.