Page Loader
HHVM : స్టార్ హీరో బ్యానర్‌పై కేరళలో 'హరహర వీరమల్లు' గ్రాండ్ రిలీజ్‌
స్టార్ హీరో బ్యానర్‌పై కేరళలో 'హరహర వీరమల్లు' గ్రాండ్ రిలీజ్‌

HHVM : స్టార్ హీరో బ్యానర్‌పై కేరళలో 'హరహర వీరమల్లు' గ్రాండ్ రిలీజ్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 24, 2025
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన భారీ బడ్జెట్ పీరియాడిక్ సినిమా 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ఖరారైంది. ఏ ఎం రత్నం నిర్మాణంలో, ఆయన కుమారుడు ఏ ఎం రత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినప్పటికీ అనేకసార్లు వాయిదా పడింది. మొత్తానికి ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికీ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ డీల్స్ పూర్తిగా ఖరారు కాలేదని సమాచారం. పాన్ ఇండియా భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను కేరళలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేయబోతున్నాడు. '

Details

కేరళలో పవన్ కళ్యాణ్ ను బిగ్ రిలీజ్

'వే ఫారర్ ఫిలిమ్స్' బ్యానర్‌ పై కేరళలో అనేక సినిమాలను నిర్మించి, రిలీజ్ చేసిన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు'ని కూడా మల్లూవుడ్‌లో విడుదల చేయనున్నట్టు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. కేరళలో పవన్ కళ్యాణ్ సినిమాకు ఇలా బిగ్ రిలీజ్ దొరికినట్టు తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల రిలీజ్ విషయంలో కూడా మరో కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎం. ఎం. కీరవాణి సంగీతాన్ని అందించారు.