
Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి శుభవార్త… హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది!!
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి వచ్చింది.
చాలాకాలంగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా చివరికి తన షూటింగ్‌ను పూర్తిచేసుకుంది.
పలు వాయిదాల తర్వాత ఈ సినిమా విడుదల తేదీపై స్పష్టత వచ్చింది.
ముందుగా మే 9న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించినప్పటికీ, షూటింగ్ కేవలం రెండు, మూడు రోజుల క్రితమే ముగియడంతో ఆ తేదీన విడుదల చేయడం సాధ్యపడదని స్పష్టమవుతోంది.
తాజా సమాచారం ప్రకారం,ఈ భారీ చారిత్రాత్మక చిత్రం 2025 జూన్ 12న థియేటర్లలో విడుదల కానుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
మే 6న అధికారికంగా షూటింగ్ వర్క్ పూర్తయింది
ఈ విషయాన్ని బుక్ మై షో సంస్థ తమ ప్లాట్‌ఫామ్‌లో "కమింగ్ సూన్ - జూన్ 12" అంటూ ప్రకటించి అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది.
దీంతో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ హైప్ మోడ్‌లోకి వెళ్లిపోయారు.
ఈ ప్రాజెక్టు 2020లో అధికారికంగా ప్రకటించబడినప్పటి నుంచి దాదాపు నాలుగు సంవత్సరాల సమయం గడిచింది.
అయితే ఈ గ్యాప్‌లో కోవిడ్ మహమ్మారి,పవన్ కళ్యాణ్ రాజకీయ భాద్యతలు వంటి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి.
ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో, షూటింగ్ కొంతకాలం నిలిచిపోయింది.
అయినా, 2024 సెప్టెంబరులో విజయవాడలో సెట్ వేశాక మళ్లీ షూటింగ్ పునఃప్రారంభమై, 2025 మే 6న అధికారికంగా షూటింగ్ వర్క్ పూర్తయ్యింది.
వివరాలు
విడుదలైన పాటలకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్,డబ్బింగ్,VFX పనులు ఫుల్ స్పీడ్‌లో కొనసాగుతున్నాయి.
టెక్నికల్ టీమ్ అన్ని పనులు షెడ్యూల్ ప్రకారం ముగించే ప్రయత్నంలో ఉంది.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వీరమల్లుగా కనిపించబోతున్నారు.
బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మొగల్ సామ్రాజ్యపు బాద్షా ఔరంగజేబ్ పాత్రలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తుండగా,అనుపమ్ ఖేర్,నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, జ్యోతి కృష్ణ కో-డైరెక్షన్ చేస్తున్నారు.
సంగీతాన్ని ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి అందిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన "మాట వినాలి", "కొల్లగొట్టినాదిరో" అనే పాటలు ప్రేక్షకులచే మంచి స్పందన తెచ్చుకున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది!!
#HariHaraVeeraMallu release date updated on BookMyShow as 12th June 2025
— Kalyanbabu_cults🦅 (@vudaykiran12760) May 8, 2025
Waiting for the official confirmation from movie team @HHVMFilm pic.twitter.com/MtRvjo7Jqq