LOADING...
Harihara Veeramallu : వాయిదా పడిన హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్‌!
వాయిదా పడిన హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్‌!

Harihara Veeramallu : వాయిదా పడిన హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 04, 2025
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక పౌరాణిక చిత్రం 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అడ్డంకి ఏర్పడింది. ఈ నెల 8వ తేదీన తిరుపతిలోని ఎస్‌వీయూ తారకరామ క్రీడా మైదానంలో ఈ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ, అనివార్య కారణాలతో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని కూడా తెలియజేశారు. ఇక ఈ సినిమా విడుదలపై కూడా వాయిదా వార్తలు సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.

Details

త్వరలోనే అధికారిక ప్రకటన

ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, జ్యోతి కృష్ణ దర్శకత్వ పర్యవేక్షణ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 12న విడుదల కావాల్సిన ఈ సినిమా, ప్రస్తుతం నిర్మాణాంతర దశలో వీఎఫ్ఎక్స్‌ సహా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి కాకపోవడంతో విడుదలను వెనక్కి జరపాలని నిర్మాతలు నిర్ణయించినట్టు సమాచారం. ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదాపై అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ, సినిమా విడుదల తేది మార్పుపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. త్వరలో దీనిపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.