Harish Shankar : ట్వీట్ వివాదం తర్వాత మహేశ్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన హరిష్ శంకర్
ఈ వార్తాకథనం ఏంటి
ఒక సినిమా విజయవంతం కావాలంటే అన్ని హీరోల అభిమానుల మద్దతు అవసరమని దర్శకుడు హరిష్ శంకర్ అన్నారు. ఆయన దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చి 19న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చోటుచేసుకున్న ఒక వివాదంపై ఆయన స్పందిస్తూ మహేష్ బాబు అభిమానులకు క్షమాపణలు చెప్పారు. పని ఒత్తిడిలో ఉండటంతో ఒక అభిమాని చేసిన ట్వీట్‌ను పూర్తిగా చదవకుండానే అనుకోకుండా రిప్లై ఇచ్చానని హరీశ్ శంకర్ వెల్లడించారు. కొన్ని రోజులుగా తాను తీవ్రంగా బిజీగా ఉన్నానని తెలిపారు. సెన్సార్ పనులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సినిమా సాంగ్ ప్రోమోకు సంబంధించిన ఫైనల్ చెక్‌లు వంటి పనులతో నిరంతరం పని చేస్తున్నానని చెప్పారు.
Details
సినిమా ప్రోమోపై వస్తున్న స్పందనలకు కృతజ్ఞతలు
ఈ బిజీ షెడ్యూల్ మధ్యలో సినిమా ప్రోమోపై వస్తున్న స్పందనలకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో అభిమానులకు రిప్లైలు ఇస్తున్నానని వివరించారు. అలాంటి హడావుడిలో ఒక ట్వీట్‌ను పూర్తిగా చదవకుండానే పొరపాటున కోట్ చేశానని చెప్పారు. అయితే తన టీమ్ వెంటనే అప్రమత్తం చేయడంతో పొరపాటు తెలుసుకుని నిమిషం వ్యవధిలోనే ఆ రిప్లైను తొలగించానని తెలిపారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుపై తనకు ఎంతో గౌరవం ఉందని కూడా హరీశ్ శంకర్ స్పష్టం చేశారు. మహేశ్ బాబు నటిస్తున్న వారణాసి చిత్రంతో ఆయన మరెన్నో రికార్డులు సృష్టిస్తారని నమ్ముతున్నానని పేర్కొన్నారు.
Details
d
గతంలో పోకిరి సినిమా గురించి తాను పెట్టిన పోస్టులను చూస్తే మహేశ్ బాబుపై తనకు ఉన్న అభిమానాన్ని ఎవరికైనా అర్థమవుతుందని అన్నారు. ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు. ఒక సినిమా హిట్ కావాలంటే అన్ని హీరోల అభిమానుల మద్దతు అవసరమని హరీశ్ శంకర్ చెప్పారు. సినిమా విడుదలకు కేవలం పది రోజుల సమయం మాత్రమే ఉన్న ఈ సమయంలో ఇలాంటి వివాదాలకు తావిచ్చేంత అవివేకి తాను కాదని పేర్కొన్నారు. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటు వల్ల ఎవరికైనా బాధ కలిగితే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని, పెద్ద మనసుతో అర్థం చేసుకుని 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను ఆదరించాలని ఆయన అభిమానులను కోరారు.
Details
రాబోయే సినిమాపై నెగెటివ్ ట్వీట్
ఇక అసలు వివాదం ఎలా ప్రారంభమైందంటే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హరీశ్ శంకర్ అభిమానులకు తరచూ స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక నెటిజన్ మహేశ్ బాబు రికార్డుల గురించి, ఆయన రాబోయే సినిమాపై నెగెటివ్‌గా ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌ను పూర్తిగా చదవకుండానే హరీశ్ శంకర్ అనుకోకుండా రిప్లై ఇవ్వడంతో సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. వెంటనే ఆ రిప్లైను డిలీట్ చేసినప్పటికీ అప్పటికే అది వైరల్ అయింది.