
Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'ఉస్తాద్ భగత్‌సింగ్' షెడ్యూల్ పూర్తి
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్‌సింగ్' కోసం అభిమానులు బాగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు దర్శకుడు హరీశ్ శంకర్ మంచి వార్త తెలిపారు. సినిమాలో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన షెడ్యూల్ పూర్తయిందని ప్రకటిస్తూ, ఓ ప్రత్యేకమైన ఫొటోను ఆయన సోషల్‌మీడియాలో పంచుకున్నారు.
వివరాలు
మాటిచ్చినప్పుడు నిలబెట్టుకునే వ్యక్తి పవన్
ఇటీవలే పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమా పనులు ముగించి, అదే ఉత్సాహంతో 'ఉస్తాద్ భగత్‌సింగ్' షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆయన పట్టుదల, సహకారం వల్లే షూటింగ్ వేగంగా పూర్తయిందని దర్శకుడు హరీశ్ తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. "మాటిచ్చినప్పుడు నిలబెట్టుకునే వ్యక్తి, ఆయన పక్కనుంటే విద్యుత్ ప్రవహిస్తున్నట్లుగా అనిపిస్తుంది" అంటూ పవన్‌తో దిగిన ఫొటోను పంచుకున్నారు. ఆ రోజు తన జీవితంలో మరచిపోలేని జ్ఞాపకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఎటువంటి ఎనర్జీతో షూటింగ్‌లో పాల్గొన్నారో అది సినిమాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పారు. ఈ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హరీష్ శంకర్ చేసిన ట్వీట్
#PawanKalyan & #HarishShankar from the sets of #UstaadBhagatSingh 🥵💥💥💥 #UBS 🎯 pic.twitter.com/M0WfmEJSU4
— Narendra News (@Narendra4News) August 4, 2025
వివరాలు
హరీశ్ శంకర్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్
ప్రస్తుతం హరీశ్ శంకర్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ సాదాసీదాగా కనిపించడంతో అభిమానులు ఆ ఫొటోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఇక,గతంలో వీరిద్దరూ కలిసి చేసిన 'గబ్బర్‌సింగ్' హిట్ తరువాత,మళ్లీ పవన్ కళ్యాణ్-హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో,ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసినిమాలో పవన్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయనకు జోడీగా శ్రీలీల,రాశీ ఖన్నా నటిస్తున్నారు. ఈసినిమాకు సంగీత దర్శకత్వం బాధ్యతలను దేవీశ్రీ ప్రసాద్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరో సినిమా ఓజీలో కూడా నటిస్తున్నారు. ఇది గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కుతున్న చిత్రంగా,దీనికి దర్శకుడు సుజీత్. రెండు సినిమాలపై కూడా అభిమానులలో విపరీతమైన ఆసక్తి నెలకొంది.