ఉస్తాద్ భగత్ సింగ్ కథా మార్పులపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టిన హరీష్ శంకర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ తో హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తమిళ చిత్రమైన తెరీ నుండి రీమేక్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే తెరీ సినిమా కథకు ఉస్తాద్ భగత్ సింగ్ కథకు చాలా మార్పులు ఉంటాయని, తెరీ సినిమాలో పాపకు బదులుగా ఉస్తాద్ భగత్ సింగ్ లో బాబు పాత్ర ఉంటుందనీ, అలాగే, తెరీలో బేకరీ మ్యాన్ గా విజయ్ కనిపిస్తే, ఇందులో పవన్ కళ్యాణ్ లెక్చరర్ గా కనిపిస్తారని అన్నారు. ఇవేవీ నిజం కావనీ, ట్విట్టర్ వేదికగా ఒక్క మాటతో తేల్చేసారు హరీష్ శంకర్.