Vidya balan: 'తల్లితండ్రుల ఎదుటే నన్ను అవమానించాడు'.. విద్యాబాలన్
బాలీవుడ్ నటి విద్యాబాలన్ తన కెరీర్ ప్రారంభంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దక్షిణాదికి చెందిన ఓ నిర్మాత తనను అవమానించిన ఘటన గురించి స్పందించారు. ఆ మాటలకు దాదాపు ఆరు నెలలు అద్దంలో చూసుకోలేక పోయానని తెలిపారు. చక్రం అనే మలయాళ చిత్రంతో ఆమె నటిగా ఎంట్రీ ఇచ్చింది, ఇందులో మోహన్‌లాల్ హీరోగా ఉన్నారు. కెరీర్ ప్రారంభంలోనే స్టార్ హీరోతో సినిమాలు చేస్తున్నందుకు చాలా అవకాశాలు ఆమెకు లభించాయి. అయితే, అనివార్య కారణాల వల్ల చక్రం షూటింగ్ ఆగిపోయింది. దీని కారణంగా మిగిలిన సినిమాల్లో ఆమెను తొలగించి, వేరే హీరోయిన్స్‌ను నియమించారు.
డాన్స్ రాదని ఎగతాళి చేశారు
మూడేళ్లు తనకు ఈ విషయంలో తీవ్ర బాధగా అనిపించిందని, ఏం జరుగుతుందో అర్థం కాక కుంగిపోయాయని, ఇంట్లో ప్రతిరోజూ గొడవలు జరుగుతూ ఉండేవని పేర్కొంది. తన తోటి వాళ్లు సెటిల్ అవుతున్నప్పుడు, తాను ఎందుకు ఇక్కడే ఆగిపోయాయని అనిపించిందన్నారు. హీరోయిన్‌లా ఎక్కడైనా కనిపిస్తుందా..? డ్యాన్స్ రావు, యాక్టింగ్ రావు అని బాధపెట్టారని పేర్కొంది. ఈ ఘటన తర్వాత, ప్రదీప్ సర్కార్ తనకు అండగా నిలిచి, యాడ్ షూట్‌లు, సినిమాల్లో అవకాశాలు అందించినట్లు ఆమె గుర్తుచేశారు. ఆ సమయంలో ఆత్మవిశ్వాసం కోల్పోయాయని, కానీ ప్రదీప్ తన పక్కన ఉండటం తనకు ఎంతో సాయపడిందని విద్యాబాలన్ చెప్పారు.