LOADING...
Mrunal Thakur: నాతో ఉండలేనన్నాడు.. అందుకే విడిపోయాం: మృణాల్‌ ఠాకూర్‌ ఓపెన్‌ కామెంట్స్
నాతో ఉండలేనన్నాడు.. అందుకే విడిపోయాం: మృణాల్‌ ఠాకూర్‌ ఓపెన్‌ కామెంట్స్

Mrunal Thakur: నాతో ఉండలేనన్నాడు.. అందుకే విడిపోయాం: మృణాల్‌ ఠాకూర్‌ ఓపెన్‌ కామెంట్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2026
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల ప్రేమ, పెళ్లి అంశాలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్న నటి మృణాల్‌ ఠాకూర్‌ మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. తాజాగా ఆమె తన మాజీ ప్రేమికుడి గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. అతడితో బంధం ముగిసిపోయినందుకు తానేమీ బాధపడలేదని మృణాల్‌ స్పష్టం చేశారు. మృణాల్‌ నటించిన తాజా చిత్రం 'దో దీవానే శహర్‌ మే' ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన గత ప్రేమబంధం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 'నాకు ఎక్కువ అని, నాతో కలిసి ఉండలేనని అతడు బ్రేకప్‌ చెప్పాడు.

Details

నేను యాక్టింగ్‌ చేయడం అతడికి నచ్చలేదు

నేను యాక్టింగ్‌ చేయడం కూడా అతడికి నచ్చలేదు. విడిపోవడానికి అది కూడా ఒక కారణమే. బ్రేకప్‌ చెప్పినందుకు నేను బాధపడలేదు. అతడి మనస్తత్వం గురించి జాలి పడ్డాను. అలాంటి వ్యక్తులతో కొనసాగడం చాలా కష్టం. అందుకే విడిపోయాం. అలాంటి వాళ్లతో ఉంటే భవిష్యత్తులో పిల్లలు కూడా అదే భావనలతో పెరుగుతారు. అది నాకు ఇష్టం లేదని మృణాల్‌ తెలిపారు. ఇదిలా ఉండగా, గత కొన్ని నెలలుగా మృణాల్‌ డేటింగ్‌ వార్తలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చాయి. నటుడు ధనుష్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరగగా, ఆయన తనకు మంచి స్నేహితుడేనని చెబుతూ మృణాల్‌ ఆ వార్తలను ఖండించారు.

Details

ఫేక్ వార్తలను సృష్టిస్తున్నారు

అనంతరం టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్నట్లు మరోసారి రూమర్స్‌ వచ్చాయి. ఈ ప్రచారాలపై స్పందించిన మృణాల్‌.. 'ఇలాంటి రూమర్స్‌ వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉంటాయి. వాళ్లు వార్తలు సృష్టిస్తుంటారు. వాటిని చూసి నేను నవ్వుకుంటాను. ఇవన్నీ ఫ్రీ పీఆర్‌ స్టంట్స్‌ మాత్రమే అంటూ స్పష్టం చేశారు.

Advertisement