
మాజీ భర్తపై రాఖీ సావంత్ కామెంట్స్ వైరల్: తన న్యూడ్ వీడియోలు అమ్ముకున్నాడని ఆరోపణ
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ తన భర్త అదిల్ ఖాన్ దురానీపై తీవ్రమైన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అదిల్ ఖాన్ దురానీకి దూరంగా ఉంటున్న ఆమె, తన న్యూడ్ వీడియోలను భర్త అమ్ముకున్నాడని కామెంట్స్ చేసింది.
తాను బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా తన భర్త వీడియోలు తీసాడని, ఆ వీడియోలను 47లక్షలకు అమ్ముకున్నాడని ఆమె చెబుతోంది.
తన భర్త వల్ల నరకం చూసానని రాఖీ సావంత్ ఆరోపిస్తుంది. తన మీద రోజూ అత్యాచారం చేసేవాడనీ, మీడియా ముందుకు వచ్చి నేను తల్లిని కాలేనని చెప్పాడనీ, ఏ భర్తయినా అలా చెబుతాడా అని ఆమె నిలదీసింది.
Details
విషం తాగి చనిపోవాలా అంటూ ఎమోషనల్ అయిన రాఖీ
ప్రస్తుతం తన న్యూడ్ వీడియోలు ఇంటర్నెట్ లో తిరుగుతున్నాయనీ, ఇప్పుడు తనకేం చేయాలో తెలియట్లేదనీ, అందరూ వీడియోలను చూసిన తర్వాత ఇంకా ఇప్పుడేం చేయాలని ఆమె అంటుంది.
తాను ఒక సెలెబ్రిటీనని, సాధారణ అమ్మాయిని కాదని, ఇలా న్యూడ్ వీడియోలు బయటకు వచ్చేస్తే ఏం చేయాలో తెలియట్లేదని, విషం తాగి చనిపోవాలా? నా ముఖం ఎలా చూపించాలి? అంటూ ఎమోషనల్ అయ్యారు.
కొన్ని రోజుల క్రితం అదిల్ ఖాన్ దురానీని రహస్యంగా పెళ్ళి చేసుకున్న రాఖీ సావంత్, సంవత్సరం కూడా గడవక ముందే అతనితో బంధాన్ని వదులుకుని బయటకు వచ్చేసింది.