LOADING...
Mahesh Babu: 5వేల మందికి హార్ట్ ఆపరేషన్లు.. మహేష్ బాబుపై ప్రశంసలు వర్షం
5వేల మందికి హార్ట్ ఆపరేషన్లు.. మహేష్ బాబుపై ప్రశంసలు వర్షం

Mahesh Babu: 5వేల మందికి హార్ట్ ఆపరేషన్లు.. మహేష్ బాబుపై ప్రశంసలు వర్షం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 18, 2025
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌స్టార్ మహేష్ బాబు సినిమాల్లో మాత్రమే కాదు, సామాజిక సేవలోనూ నిజమైన హీరోగా గుర్తింపు పొందారు. ఆయన కొడుకు గౌతమ్ పుట్టినప్పుడే కొన్ని హెల్త్ సమస్యలు ఎదురయ్యాయి. గౌతమ్‌కు హార్ట్‌లో చిన్న సమస్య రావడం కారణంగా మహేశ్ బాబు గుండె వ్యాధులతో బాధపడే చిన్నారుల కోసం ఫౌండేషన్ ద్వారా సేవలు అందించడంలో ముందడుగు వేసాడు. ప్రస్తుతం 5వేల మందికి హార్ట్ ఆపరేషన్లు ఫౌండేషన్ ద్వారా పూర్తయ్యాయని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. చిన్నారుల ప్రాణాలను కాపాడుతున్న మహేశ్ బాబును అభిమానులు ప్రశంసిస్తున్నారు.

Details

ఫౌండేషన్ కార్యకలాపాలు

మహేశ్ బాబు ఫౌండేషన్ అనేక హాస్పిటల్స్‌తో లింక్ అయి, ఆపరేషన్ల ఖర్చులను భరిస్తోంది. నిరుపేద కుటుంబాలు తమ పిల్లల హార్ట్ ఆపరేషన్లను కాపాడుకోలేకపోతే, ఫౌండేషన్ అండగా నిలుస్తోంది. మహేశ్ బాబు ఈ సేవలను ఇలాగే కొనసాగిస్తానని గతంలోనే ప్రకటించారు. క్రీయేటివ్ ఫ్రంట్‌లో, మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళ్‌తో భారీ పాన్-వరల్డ్ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా కొంచెం షెడ్యూల్ గ్యాప్ తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఫారిన్ షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నవంబర్‌లో సినిమా నుంచి భారీ అప్డేట్స్ రాబోతున్నాయని టాక్ ఉంది.