తదుపరి వార్తా కథనం

Mohanlal: హేమ కమిటీ ఎఫెక్టు.. 'అమ్మ'కు మోహన్ లాల్ టీం రాజీనామా
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 27, 2024
04:49 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం మలయాళ సినీ ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్టు కలకలం రేపుతోంది.
మలయాళ సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయని, చాలామంది క్యాస్టింగ్ కౌచ్‌కి బాధితులుగా ఉన్నారని హేమ్ రిపోర్టు నివేదిక ఇచ్చింది.
ఈ నేపథ్యంలో పలువురు నటీమణులు ముందుకొచ్చి తాము క్యాస్టింగ్ కౌచ్ బాధితులమని సంచలన ప్రకటనలు చేశారు.
ప్రస్తుతం దీనిపై తీవ్ర దుమారం సాగుతున్న వేళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆయనతో పాటు అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ లోని మెంబర్స్ అందరూ కూడా రాజీనామా చేశారు.