
Keedaa Cola: 'కీడా కోలా' స్పెషల్ ప్రీమియర్ షో చూసిన చిత్రబృందం.. రివ్యూ ఏంటో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి కొత్త కథలతో టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సంచలన విజయాలు సాధించాడు.
ఈ క్రమంలోనే ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా 'కీడా కోలా' విడుదలైంది.
నవంబర్ 3న విడుదల కానున్న ఈ చిత్రం స్పెషల్ షోను చిత్ర బృందం సహా స్నేహితుల కోసం తరుణ్ భాస్కర్ ప్రత్యేకంగా ప్రదర్శింపజేశారు. సినిమా చూసిన వాళ్లంతా చక్కటి స్టోరీ అంటూ కీర్తించారు.
క్రైమ్ కామెడీగా తెరకెక్కిన 'కీడా కోలా'లో బ్రహ్మానందం, చైతన్య రావు, రాగ్ మయూర్, తరుణ్ భాస్కర్, 'టాక్సీవాలా' విష్ణు, జీవన్ కుమార్, రవీంద్ర విజయ్, రఘురామ్ తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారన్నారు.
DETAILS
ఈ ఇయర్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇదేనంట
ఈ మూవీని కె. వివేక్ సుధాంషు, సాయి కృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ లు సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహించారు.
రానా దగ్గుబాటి సమర్పణలో విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1గా ఈ సినిమా రూపుదిద్దుకుంది.
ఇప్పుడే 'కీడా కోలా' చూశా, తరుణ్ భాస్కర్ అన్ లిమిటెడ్ ఫన్ నేపథ్యంలో తీసిన ఈ సినిమా మనస్ఫూర్తిగా నవ్విస్తోందని, మీరు ఇందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
మరో నిర్మాత అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ ఈ ఇయర్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇదేన్నారు. అందరూ కొట్టి చంపితే తరుణ్, నవ్వించి నవ్వించి చంపావని మెచ్చుకున్నారు. నేను అదే చెబుతున్నా బొమ్మ బ్లాక్ బస్టర్ అని మరో నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్న నెటిజన్
Got a chance to watch #KeedaaCola yesterday........ What a movie......... @TharunBhasckerD andharu kotti samputharu.... Nuvvu navvinchi navvinchi sampav another CULT on the way....... When you said " IM CONFIDENT" at pre release same coppy paste BOMMA BLOCKBUSTER
— Pothuri Harish Raju (@HarishPothuri) October 31, 2023