Page Loader
Mad Square: మ్యాడ్ స్క్వేర్  ఫస్ట్ లుక్ - ఫస్ట్ సింగిల్ రిలిజ్ చేసిన మేకర్స్
మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ లుక్ - ఫస్ట్ సింగిల్ రిలిజ్ చేసిన మేకర్స్

Mad Square: మ్యాడ్ స్క్వేర్  ఫస్ట్ లుక్ - ఫస్ట్ సింగిల్ రిలిజ్ చేసిన మేకర్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2024
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్,సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం "మ్యాడ్". గతేడాది చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. కామెడీ ప్రధానంగా కాలేజీ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన మనోజ్, అశోక్, దామోదర్ పేర్ల మొదటి అక్షరాలను తీసుకొని "మ్యాడ్" అనే టైటిల్ పెట్టడం ప్రత్యేకం. శ్రీగౌరి ప్రియా రెడ్డి, అనంతికా సనిల్‌కుమార్‌, గోపికా ఉద్యన్‌ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించడంతో, ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు.

వివరాలు 

ది బాయ్స్ అర్ కమింగ్ విత్ మ్యాడ్ మాక్స్

తాజాగా, "మ్యాడ్" సీక్వెల్ "మ్యాడ్ స్క్వేర్" (మ్యాడ్ 2)కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తూ, సినిమా ఫస్ట్ సింగిల్‌ను సెప్టెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్టు ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. "ది బాయ్స్ అర్ కమింగ్ విత్ మ్యాడ్ మాక్స్" అనే కాప్షన్ జోడించారు. ఈ సీక్వెల్‌ను నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారికా సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ విడుదలకు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ చేసిన ట్వీట్