LOADING...
పొన్నియన్ సెల్వన్ 2: కార్తీ కోసం చెన్నై తరలి వచ్చిన జపాన్ అభిమానులు 
పీఎస్ - 2 సినిమాను చూడడానికి వచ్చిన జపాన్ అభిమానులు

పొన్నియన్ సెల్వన్ 2: కార్తీ కోసం చెన్నై తరలి వచ్చిన జపాన్ అభిమానులు 

వ్రాసిన వారు Sriram Pranateja
May 02, 2023
06:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ రెండవ భాగం రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వసూళ్ళు చేస్తోంది. ఇప్పటివరకు 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ఈ మేర కలెక్షన్లు రావడంతో పొన్నియన్ సెల్వన్ 2 చిత్రం పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో నటించిన కార్తీ కోసం జపాన్ నుండి అభిమానులు చెన్నైకి తరలి వచ్చారు. అవును, తాజాగా జపాన్ అభిమానులతో హీరో కార్తీ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు పొన్నియన్ సెల్వన్ 2 చిత్రాన్ని రెండు సార్లు చూసారు జపాన్ అభిమానులు. సినిమా చూసిన అనంతరం కార్తీని కలుసుకుని లంచ్ చేసారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కార్తీ కోసం ఇండియాకు వచ్చిన జపాన్ అభిమానులు