LOADING...
Nagarjuna: నా ఫోటోలు వాడితే కఠిన చర్యలు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన టాలీవుడ్ స్టార్
నా ఫోటోలు వాడితే కఠిన చర్యలు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన టాలీవుడ్ స్టార్

Nagarjuna: నా ఫోటోలు వాడితే కఠిన చర్యలు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన టాలీవుడ్ స్టార్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2025
04:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ఫోటోలు అనుమతి లేకుండా వాడకూడదంటూ దీనిపై ఆంక్షలు విధించమని ఆయన పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. ఈకేసును జస్టిస్ తేజస్ కారియా విచారించారు. నాగార్జున తరుపున న్యాయవాదులు వాదిస్తూ, సోషల్ మీడియాలో ప్రదర్శించబడిన కంటెంట్,వస్త్రాలు లేదా ఇతర ఉత్పత్తులపై ఆయన ఫోటోలను అనధికారికంగా ఉపయోగించడం వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘన అని హైకోర్టుకు వివరించారు. వాదనల అనంతరం,ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం ప్రకటించింది. అక్కినేని నాగార్జున వ్యక్తిత్వ హక్కులను రక్షించేందుకు ప్రయత్నిస్తామని స్పష్టంగా తెలిపింది. ఈనిర్ణయంతో, సోషల్ మీడియాలోనే కాకుండా ఇతర ఏ విధమైన మాధ్యమాల్లోనైనా నాగార్జున ఫోటోలను అనుమతి లేకుండా ఉపయోగిస్తే, చట్టపరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

వివరాలు 

కెరీర్‌లో 100వ సినిమా

ఇదే విధంగా, ఇటీవల బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యరాయ్ కూడా ఇలాంటి సమస్యపై కోర్టును ఆశ్రయించి, సానుకూల తీర్పును పొందిన సంగతి తెలిసిందే. సినిమాల విషయానికి వస్తే, నాగార్జున ఇటీవల కుబేర, కూలీ వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఆయన తన కెరీర్‌లో 100వ సినిమా రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రత్యేక ప్రాజెక్ట్‌ను కొత్త దర్శకుడు కార్తీక్ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ సినిమా త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. నాగార్జున కెరీర్‌లో మైలురాయిగా భావిస్తున్న ఈ 100వ చిత్రం ఆయనకు ఎలాంటి ఫలితాన్ని తీసుకురాబోతుందో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.