
Junior NTR: యాడ్ షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ స్వల్ప ప్రమాదం .. అభిమానులలో ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌కు ఇటీవల ఒక ప్రమాదం చోటు చేసుకుంది.హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రైవేట్ యాడ్ షూటింగ్ సమయంలో ఆయనకు అనుకోని ప్రమాదం ఎదురైంది. ఈ ప్రమాదం కారణంగా ఎన్టీఆర్ కి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదానంతరం వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు తనిఖీ చేసి, గాయాలు చిన్నవే కాబట్టి ఆందోళన అవసరం లేదని తెలిపారు. డాక్టర్లు ఎన్టీఆర్ ఆరోగ్యం బానే ఉందని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటారనే తెలిపారు. ఈ వార్త బయటకు రావటంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలు పోస్టులు, కామెంట్లు పెట్టుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జూనియర్ ఎన్టీఆర్‌కు గాయాలు!
జూనియర్ ఎన్టీఆర్‌కు గాయాలు!
— greatandhra (@greatandhranews) September 19, 2025
హైదరాబాద్ లో యాడ్ షూటింగ్ సమయంలో @tarak9999 గాయపడ్డారు.
అభిమానులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని #JrNTR𓃵 టీం తెలిపింది. pic.twitter.com/qNmRiKZnaO