Page Loader
Hero Vishal: లక్ష్మీ మీనన్ తో పెళ్ళి వార్తలపై స్పందించిన విశాల్ 
లక్ష్మీ మీనన్ తో పెళ్ళి వార్తలపై విశాల్ స్పందన

Hero Vishal: లక్ష్మీ మీనన్ తో పెళ్ళి వార్తలపై స్పందించిన విశాల్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 11, 2023
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

హీరో విశాల్ తెలుగువారే అయినా తమిళంలో సినిమాలు చేస్తుంటారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పేరుతో సొంతంగా సినిమాలు తీస్తూ ఉంటారు. అయితే గతకొన్ని రోజులుగా హీరోయిన్ లక్ష్మీ మీనన్ తో విశాల్ పెళ్ళి అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ వార్తలపి హీరో విశాల్ స్పందించారు. సాధారణంగా తనపై పుట్టుకొచ్చే ఎలాంటి పుకార్లపై తాను స్పందించలేదనీ, స్పందించాల్సిన అవసరం లేదని తాను అనుకుంటానని అన్నారు. కానీ ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఏర్పడిందనీ, లక్ష్మీ మీనన్ తో పెళ్ళి వార్తలపై ఎలాంటి వాస్తవం లేదని, అవి కేవలం గాలి వార్తలేనని హీరో విశాల్ అన్నారు.

Details

ఎందుకు రెస్పాండ్ అయ్యాడో తెలియజేసిన విశాల్ 

లక్ష్మీ మీనన్ హీరోయిన్ కంటే ముందు ఒక అమ్మాయనీ, ఆమెను ఇబ్బంది పెట్టేలా పుకార్లు రావడంతోనే తాను స్పందిస్తున్నట్లు హీరో విశాల్ చెప్పుకొచ్చారు. ఇక పెళ్ళి గురించి మాట్లడుతూ, ఒకవేళ తాను పెళ్ళి చేసుకుంటే ఖచ్చితంగా అనౌన్స్ చేస్తానని, అప్పటివరకూ ఎలాంటి గాలివార్తలను పట్టించుకోవద్దని విశాల్ అన్నారు. హీరో విశాల్, లక్ష్మీ మీనన్ కలిసి గతంలో పల్నాడు, ఇంద్రుడు సినిమాలో నటించారు. గతకొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య ఏదో బంధం ఉందని వార్తలు వచ్చాయి. గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్ తో హీరో విశాల్ కు బంధం ఉందని వార్తలు పుట్టుకొచ్చాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లక్ష్మీ మీనన్ తో పెళ్ళి వార్తలపై విశాల్ ట్వీట్