Page Loader
Producer Sirish: హీరోలు రెమ్యునరేషన్ కోసం పీడించేస్తున్నారు : నిర్మాత శిరీష్ సంచలన వ్యాఖ్యలు
హీరోలు రెమ్యునరేషన్ కోసం పీడించేస్తున్నారు : నిర్మాత శిరీష్ సంచలన వ్యాఖ్యలు

Producer Sirish: హీరోలు రెమ్యునరేషన్ కోసం పీడించేస్తున్నారు : నిర్మాత శిరీష్ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 01, 2025
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత శిరీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఆర్య' సినిమాను కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో నిర్మించినట్టు వెల్లడించారు. సినిమా విడుదలకు ముందే హీరో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ అంశంపై అల్లు అరవింద్‌తో చర్చించామని తెలిపారు. అయితే అరవింద్ స్పందిస్తూ ముందుగా సినిమా తీయండి, తరువాత ఈ విషయాలు మాట్లాడుకుందామని సూచించారని చెప్పారు. అంతవరకు రెమ్యునరేషన్ ఎంత అవుతుందో తెలియక టెన్షన్‌గా ఉండేదామని, విడుదల తేదీ వరకూ ఆ విషయం అడిగినా, అరవింద్‌ ఖంగారు పడకండి అని ఆశ్వాసం ఇచ్చారని చెప్పారు. సినిమా విడుదలైన తర్వాత మాత్రం రెమ్యునరేషన్ విషయమై ఆసక్తికరంగా మాట్లాడారని పేర్కొన్నారు.

Details

భారీ రెమ్యునరేషన్ కోసం ఒత్తిడి చేస్తున్నారు

నైజాం ఏరియాలో కోటి వసూలైతే రూ.10 లక్షలు, రెండు కోట్లు అయితే రూ.20 లక్షలు, నాలుగు కోట్లు అయితే రూ.40 లక్షలు ఇవ్వండి. కానీ ఐదు కోట్లు వసూలైతే రూ.50 లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదని అల్లు అరవింద్‌ చెప్పారని శిరీష్ వివరించారు. దీనినిబట్టి బన్నీ రెమ్యునరేషన్ కేవలం రూ.40 లక్షలుగానే నిర్ణయించామని వెల్లడించారు. అంతేకాదు ఆ మొత్తాన్ని కూడా వెంటనే ఇవ్వమని కోరలేదని తెలిపారు. ఈ సందర్భంగా నేడు కొంతమంది నిర్మాతల కుమారులు హీరోలుగా రంగ ప్రవేశించి మొదటి సినిమాకే భారీ రెమ్యునరేషన్ కోసం ఒత్తిడి చేస్తున్నారని కుండబద్ధలు కొట్టారు. తామెంత కష్టపడి సినిమాలు నిర్మిస్తున్నామో, అలాంటి డిమాండ్లు చూస్తే ఆశ్చర్యం వేస్తుందన్నారు.