విడాకుల వార్తలపై సీరియస్ గా స్పందించిన హీరోయిన్ అసిన్
ఈ వార్తాకథనం ఏంటి
సినిమా వాళ్ళపై పుకార్లు రావడం సహజమే. కొన్నిసార్లు ఆ పుకార్లు నిజమవుతుంటాయి కూడా. కొన్నిసార్లు కేవలం వార్తల్లోనే నిలిచిపోతాయి.
సినిమా సెలెబ్రిటీలు చేస్తున్న సినిమాల గురించైతేనేమీ, ఫ్యామిలీ గురించైతేనేమీ రకరకాల గాసిప్స్ వస్తుంటాయి. తాజాగా హీరోయిన్ అసిన్ పై అలాంటి వార్త బయటకు వచ్చింది.
అసిన్ తన భర్తతో విడాకులు తీసుకోబోతుందని ఆ గాసిప్ సారాంశం. ఈ విషయమై అసిన్ స్పందించింది.
తన ఇన్స్ టా స్టోరీలో విడాకుల విషయమై రాసుకొచ్చిన అసిన్, వేసవి హాలిడేస్ లో ఉన్న తాను, తన భర్త, విడాకుల వార్తను చూసామని, ఎలాంటి ఆధారం లేకుండా ఇలాంటి వార్తలు ఎందుకు రాస్తారో అర్థం కాదని ఆమె అంది.
Details
5నిమిషాలు వృధా అయ్యిందని బాధపడుతున్న అసిన్
అంతేకాదు, గతంలోనూ ఇలాంటి నిరాధార వార్తలు వచ్చాయని, పెళ్ళి ఎక్కడ చేసుకోవాలని తాము అనుకుంటున్న సమయంలో బ్రేకప్ అయినట్లుగా వార్తలు వచ్చాయని, ఇలాంటి వార్తలు రాయవద్దని ఆమె కోరింది.
ఇప్పుడు విడాకుల వార్త చదవడం వల్ల తమ 5నిమిషాల సమయం వృధా అయ్యిందని అసిన్ అంది.
తెలుగులో అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి. శివమణి, ఘర్షణ చిత్రాల్లో హీరోయిన్ గా కనిపించిన అసిన్, అటు తమిళంలో, ఇటు హిందీలో కూడా అనేక చిత్రాలు చేసింది.
2016లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త రాహుల్ శర్మను పెళ్ళి చేసుకుని అప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉంది అసిన్. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది.