
Sudigali Sudheer: వివాదంలో సుడిగాలి సుధీర్.. ధర్మాన్ని హాస్యంగా చూపారంటూ హిందూ సంఘాల ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మ్యాజిక్ ప్రోగ్రామ్స్ తో కెరీర్ ప్రారంభించి, 'జబర్దస్త్' వేదికపై తనదైన హాస్యంతో అలరించి, సినిమాల్లో హీరోగా, వివిధ షోలకు హోస్ట్‌గా ఎదిగిన సుధీర్, ఎప్పుడూ తక్కువ మాటలతోనే నవ్వుల వర్షం కురిపించేవాడు.
అతని స్కిట్స్ ఎప్పుడూ వినోదాత్మకంగా ఉండేవి, కానీ ఎవరి మనోభావాలనూ దెబ్బతీయకుండా ఉండేవి. అయితే తాజాగా సుధీర్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు.
ఇటీవల ఓ ప్రముఖ టీవీ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సమయంలో సుధీర్ ఓ కామెడీ స్కిట్ లో పాల్గొన్నాడు.
ఆ స్టేజీపై నందీశ్వరుడి విగ్రహం కనిపించడంతో, శివుడి దర్శనాన్ని సూచించేలా చూపించాల్సిన దృశ్యాన్ని, 'అమ్మోరు దర్శనం' అంటూ పక్కనే ఉన్న నటీమణి రంభను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Details
ఇంకా స్పందించని సుడిగాలి సుధీర్
ఇది 'బావగారు బాగున్నారా' సినిమాలోని ఓ సీన్‌ను స్పూఫ్ చేసినట్టు కనిపించినా, ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలకు గురైంది.
ఈ వీడియో వైరల్ కావడంతో హిందూ భక్తులు ఆగ్రహంతో స్పందిస్తూ, దేవుడిని కించపరిచారు, ధర్మాన్ని హాస్యానికి వాడడం ఎంతవరకు సమంజసం? అంటూ మండిపడుతున్నారు.
ఇప్పటివరకు సుధీర్ కానీ, షో నిర్వాహకులు కానీ ఈ వివాదంపై స్పందించలేదు. అయినా సోషల్ మీడియాలో పెరుగుతున్న ఒత్తిడి దృష్ట్యా త్వరలోనే స్పందించే అవకాశముంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో ఇదే
సుధీర్ చేసిన ఒక స్కిట్ కొంతమంది మనోభావాలని ఇబ్బంది పెట్టింది. ఐతే ఇది సుధీర్ సృజనత్మాకత ఏం కాదు.
— Telugu360 (@Telugu360) April 9, 2025
అప్పుడెప్పుడో బావగారు బాగున్నారా సినిమా లో సీన్ రీ క్రియేట్ చేశాడు.
అప్పట్లో సోషల్ మీడియా అంటూ ఏమీ లేదు కాబట్టి అంతా లైట్ తీసుకున్నారు.
ఇప్పుడు అంతా సోషల్ మీడియా హావా కాబట్టి బుక్… pic.twitter.com/zZhCvOVEB7