Loading...
Diljit Dosanjh: 'హిందుస్థాన్ ఎవరి సొత్తు కాదు'.. ఇందౌర్ కచేరీలో దిల్జిత్ ఘాటు వ్యాఖ్యలు
'హిందుస్థాన్ ఎవరి సొత్తు కాదు'.. ఇందౌర్ కచేరీలో దిల్జిత్ ఘాటు వ్యాఖ్యలు

Diljit Dosanjh: 'హిందుస్థాన్ ఎవరి సొత్తు కాదు'.. ఇందౌర్ కచేరీలో దిల్జిత్ ఘాటు వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2026
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. నవంబర్ 15న మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో నిర్వహించిన కచేరీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 'జై శ్రీ మహాకాల్' నినాదంతో తన ప్రదర్శనను ప్రారంభించిన దిల్జిత్.. కచేరీకి ఎదురైన అడ్డంకులపై అభిమానులతో మాట్లాడారు.

వివరాలు

'ఎన్ని అడ్డంకులు వచ్చినా భయపడను'

చూడండి.. ఇది మహాకాలుడి నేల. ఇక్కడికి రావడాన్ని ఎవరూ ఆపలేరు. గతంలోనూ నేను భయపడలేదు.. ఇప్పుడు కూడా భయపడటం లేదు.

మీ అభిమానమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందని దిల్జిత్ ప్రేక్షకులతో అన్నారు. తనను ఇందౌర్‌కు రాకుండా అడ్డుకునేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని వెల్లడించారు.

ఒకసారి వస్తానని ఎవరికైనా మాటిస్తే.. ఆ మాట తప్పను. ఎన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ మీ ముందు నిలబడ్డానని పేర్కొన్నారు.

ఈ దేశ మట్టిలో అందరి రక్తం కలిసే ఉందని, హిందుస్థాన్ ఎవరి సొత్తు కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

వివరాలు

నాలుగు పాటలు పాడొద్దంటూ అధికారుల ఆదేశాలు

దిల్జిత్ ఇందౌర్ కచేరీకి ముందే వివాదాలు మొదలయ్యాయి.

ఆయన పాడే పాటల్లో మద్యం, మాదకద్రవ్యాలు, ఆయుధాలను ప్రోత్సహించేలా సాహిత్యం ఉందంటూ నాలుగు పాటలు పాడకూడదని అధికారులు ఆదేశించారు.

ఆ పాటలు చిన్నారులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు కచేరీకి ముందు ఇందౌర్‌లోని మూడు ప్రైవేటు పాఠశాలలు, మేయర్ కార్యాలయానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.

అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో అవి నకిలీ బెదిరింపులుగా గుర్తించారు.

ADVERTISEMENT