
HIT 3: 'హిట్ 3' కలెక్షన్ల సునామీ.. నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల మైలురాయి
ఈ వార్తాకథనం ఏంటి
నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన 'హిట్: ది థర్డ్ కేస్' సినిమా బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తోంది.
మే 1వ తేదీన విడుదలైన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ తొలి రోజు నుంచే శుభారంభాన్ని నమోదు చేసి, కలెక్షన్ల పరంగా సూపర్ ఫేస్‌తో దూసుకుపోతోంది.
శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్ల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడంలేదు.
Details
నాలుగు రోజుల్లోనే రూ.101 కోట్లు గ్రాస్
విశ్వవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్‌ను దాటి, నాలుగు రోజుల్లోనే రూ.101 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది.
ఈ ఫలితంతో 'హిట్ 3' ఫస్ట్ వీకెండ్‌లోనే మేజర్ మైలురాయి దాటిన చిత్రంగా నిలిచింది.
ఇది నానికి వరుసగా నాలుగో సూపర్‌హిట్ కావడం గమనార్హం.
నానికి మూడో రూ.100 కోట్ల సినిమా
'దసరా', 'హాయ్ నాన్న', 'సరిపోదా శనివారం' సినిమాల తరువాత 'హిట్ 3' రూపంలో నాని మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.
ఈ చిత్రం నానికి మూడవ రూ.100 కోట్ల చిత్రం కావడం విశేషం. ప్రస్తుత జోరు కొనసాగితే ఈ సినిమా ఫుల్ రన్‌లో రూ.200 కోట్ల మార్క్‌ను చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Details
మరిన్ని కలెక్షన్లు సాధించ అవకాశం
ఇది జరగితే నానికి ఆ స్థాయి ఫస్ట్ టైమ్ కావడం విశేషం. సోమవారం నుంచి ట్రెండ్ ఏంటన్నదే ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశం.
'హిట్ 3' ఇప్పటికే ఓవర్సీస్, నైజాం, వైజాగ్ తదితర ప్రాంతాల్లో లాభాల్లోకి వెళ్లింది. కొన్ని చోట్ల బ్రేక్‌ఈవెన్ పూర్తయింది.
మరో రెండు మూడు రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో బయ్యర్లు లాభాల్లోకి వస్తారని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వేసవిలో టాలీవుడ్‌కు 'హిట్ 3' మంచి ఊరటనిచ్చే హిట్‌గా నిలుస్తోంది.