Hit3 : హిట్-3 ఫస్ట్ సాంగ్ విడుదల.. నాని-శ్రీనిధి మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ హైలైట్!
ఈ వార్తాకథనం ఏంటి
హిట్ సిరీస్‌లో భాగంగా వస్తున్న హిట్-3: ది థర్డ్ కేస్ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన హిట్, హిట్-2 చిత్రాలు ఘన విజయం సాధించాయి.
ఇప్పుడు మూడో భాగంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ ఇప్పటికే భారీ స్పందనను అందుకుంది.
ఇటీవల హిట్-3 ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేశారు. మెలోడీ క్లాసిక్‌గా సాగిన ఈ పాట నాని-శ్రీనిధి మధ్య రొమాంటిక్ లవ్ సాంగ్‌గా రూపొందింది.
Details
విభిన్నమైన పాత్రలో నాని
ప్రేమ వెల్లువ అంటూ సాగే ఈ పాటను శైలేష్ సిద్ధ్ శ్రీరామ్, నూతన మోహన్ కలిసి ఆలపించారు.
పాట గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాని, శ్రీనిధి కెమిస్ట్రీను అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో నాని విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో మరింత వైలెంట్ అవతార్‌లో కనిపిస్తున్నాడు.
భారీ అంచనాల నడుమ మే 1న సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. హిట్ సిరీస్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకోవాలని నాని ఆశిస్తున్నాడు.