
NANI : హిట్ 3కు A సర్టిఫికెట్.. రన్ టైమ్ ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను సృష్టించిన క్రైమ్ థ్రిల్లర్ యూనివర్స్‌లో "హిట్: ది ఫస్ట్ కేస్" "హిట్ 2: ది సెకండ్ కేస్" సినిమాలు మంచి విజయాలను సాధించాయి.
మొదటి భాగంలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, రెండో భాగంలో అడివి శేష్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ రెండు సినిమాలను హీరో నాని తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నిర్మించారు.
ఇప్పుడు ఈ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీని కొనసాగిస్తూ 'హిట్ 3'లో నానినే కథానాయకుడిగా కనిపించనున్నాడు.
అర్జున్ సర్కార్ పాత్రలో నాని నటవిశ్వరూపం చూపించనున్నాడని, ఇప్పటికే విడుదలైన టీజర్ ద్వారా స్పష్టమైంది.
ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
Details
మే 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్
ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమాలో హింసాత్మక సన్నివేశాలు, కొంతమేర డబుల్ మీనింగ్ డైలాగులు ఉండడంతో, కొన్ని హింసాత్మక సన్నివేశాలను తొలగించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో చిత్రానికి సెన్సార్ బోర్డుA సర్టిఫికెట్ జారీ చేసింది. ఫైనల్ రన్ టైమ్ రెండు గంటల 35 నిమిషాలుగా ఉండనుంది. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
సరికొత్త అవతారంలో నాని నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచనున్నాడనే టాక్ వినిపిస్తోంది.
ఈ నెల 14న విడుదల కాబోతున్న థియేట్రికల్ ట్రైలర్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచనుందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
సిల్వర్ స్క్రీన్‌పై రక్తపు మరకలతో థ్రిల్లింగ్ అనుభూతిని ఇచ్చే హిట్ 3, విడుదలైన తర్వాత ఎంతటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి.