
HIT 3: హిట్ 3 బాక్సాఫీస్ వద్ద షాకింగ్ కలెక్షన్.. మూడో రోజూ హౌస్‌ఫుల్స్!
ఈ వార్తాకథనం ఏంటి
నేచురల్ స్టార్ నాని నటించిన క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3 బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, మే డే సందర్భంగా మే 1న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైంది.
టీజర్, ట్రైలర్‌ల నుంచే మంచి హైప్‌ను సొంతం చేసుకున్న హిట్ 3, భారీ ఎత్తున థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసింది.
విడుదలకు ముందే తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమా రెట్రోతో పోటీ ఉండగా, హిట్ 3 తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో ముందంజ వేశారు.
సినిమాలో హింసాత్మక దృశ్యాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు విమర్శించినా, కలెక్షన్స్‌పై మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేదు.
Details
వంద కోట్లకు చేరువలో
అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే జోరు చూపించిన హిట్ 3, తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 43 కోట్లు వసూలు చేసి, నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది.
రెండో రోజు వర్కింగ్ డే అయినప్పటికీ, స్ట్రాంగ్ కలెక్షన్స్‌తో మొత్తం రెండు రోజులకు రూ. 62 కోట్లు రాబట్టింది.
వీకెండ్ రోజు అయిన శనివారం థియేటర్లలో హౌస్‌ఫుల్స్ బోర్డ్స్ కనిపించగా, మూడో రోజు కలెక్షన్స్‌తో కలిపి సినిమా రూ. 82 కోట్ల వసూళ్లను అందుకుంది.
ఈ సందర్భంగా మేకర్స్ ఓ అఫీషియల్ కలెక్షన్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
ప్రస్తుతం హిట్ 3, ఈ వీకెండ్ ముగిసే నాటికి 100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వేగంగా దూసుకెళుతోంది.