Page Loader
HIT 3: మోస్ట్ వైలెంట్‌గా 'హిట్ 3' ట్రైలర్‌... అద్భుతమైన వైల్డ్‌ యాక్షన్!

HIT 3: మోస్ట్ వైలెంట్‌గా 'హిట్ 3' ట్రైలర్‌... అద్భుతమైన వైల్డ్‌ యాక్షన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 14, 2025
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

'హిట్' యూనివర్స్‌లోని తదుపరి భాగంగా రూపొందుతున్న తాజా చిత్రం 'హిట్: ది థర్డ్ కేస్' (HIT 3) ప్రేక్షకుల మదిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని శైలేశ్ కొలను డైరెక్ట్ చేస్తున్నారు. కథానాయికగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఈ సినిమాలో నాని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అర్జున్ సర్కార్‌గా కనిపించనున్నాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌లో వరుస హత్యల పాజిల్‌ను అర్జున్ సర్కార్ ఎలా చేధించాడు అనే అంశం కీలకంగా నెరపుతోంది. ట్రైలర్‌ చూస్తే సినిమాలోని థ్రిల్, మిస్టరీ ఎలిమెంట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. నాని డైలాగ్స్, పెర్ఫార్మెన్స్‌తో అర్జున్ పాత్రకు న్యాయం చేశాడు.