ఆర్ఆర్ఆర్ హీరోలతో నటించాలనుందని చెప్పిన హాలీవుడ్ యాక్టర్
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు, ప్రశంసలు దక్కాయి. అందని ద్రాక్షలా ఊరించిన ఆస్కార్ సైతం ఆర్ఆర్ఆర్ ఖాతాలో చేరిపోయింది.
ఆర్ఆర్ఆర్ కారణంగా హాలీవుడ్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు మంచి పాపులారిటీ ఏర్పడింది. హాలీవుడ్ దర్శకులు ఆర్ఆర్ఆర్ హీరోలతో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
తాజాగా హాలీవుడ్ యాక్టర్ క్రిస్ హెమ్స్ వర్త్, ఆర్ఆర్ఆర్ సినిమాను తాను చూసాననీ, చాలా బాగుందనీ, ఆర్ఆర్ఆర్ హీరోలతో వర్క్ చేయాలనుందని చెప్పుకొచ్చాడని న్యూస్ 18 రాసుకొచ్చింది.
మార్వెల్ అద్భుతం థోర్ సినిమాలో నటించాడు క్రిస్ హెమ్స్ వర్త్. మార్వెల్ సినిమాలను ఇష్టపడే అభిమానులకు క్రిస్ హెమ్స్ వర్త్ సుపరిచితుడే.
Details
ఇండియా పేరును కూతురుకు పెట్టుకున్న క్రిస్
ప్రస్తుతం,2020లో రిలీజైన యాక్షన్ బ్లాక్ బస్టర్ ఎక్స్ ట్రాక్షన్ సినిమా సీక్వెల్ లో క్రిస్ హెమ్స్ వర్త్ కనిపిస్తున్నాడు.
ఎక్స్ ట్రాక్షన్ 2 లో టైలర్ రేక్ పాత్రలో కనిపిస్తున్న క్రిస్, ఆ సినిమాలో నటించడంపై మాట్లాడుతూ, థోర్ తర్వాత చేస్తున్న ఎక్స్ ట్రాక్షన్ కోసం తన బాడీని చాలా వరకు మార్చుకున్నట్లు చెప్పుకొచ్చారు.
ఎక్స్ ట్రాక్షన్ 2లో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని క్రిస్ తెలియజేసారు. ఈ సీక్వెల్ ని చాలాభాగం ఇండియాలో షూట్ చేసారట. ఇండియా అంటే ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తాడు హెమ్స్ వర్త్. అందుకే తన కూతురుకు ఇండియా అని పేరు పెట్టుకున్నాడు.