హాలీవుడ్ లో విషాదం: నటుడు డారెన్ కెంట్ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ హాలీవుడ్ నటుడు డారెన్ కెంట్ కన్నుమూశారు. 36ఏళ్ల వయసులో అనారోగ్య కారణాల వల్ల ఆగస్టు 11వ తేదీన డారెన్ కెంట్ తుదిశ్వాస విడిచారు.
డారెన్ కెంట్ మరణవార్తను అతని టాలెంట్ ఏజెన్సీ అయిన కేరే డాడ్ అసొసియేట్స్ ట్విట్టర్ ద్వారా ఆగస్టు 15వ తేదీన వెల్లడి చేసింది.
డారెన్ కెంట్ మృతి పట్ల హాలీవుడ్ సెలెబ్రిటీలు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
డారెన్ కెంట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ లో ఒకానొక పాత్రలో కనిపించారు. ఈ సిరీస్ లోని డారెన్ నటనకు మంచి పేరొచ్చింది. 2008లో మిర్రర్స్ అనే సినిమాతో ఇండస్ట్రీలీకి డారెన్ కెంట్ అడుగుపెట్టారు.
Details
చర్మ సంబంధ సమస్యతో బాధపడిన డారెన్ కెంట్
డారెన్ కెంట్ నటించిన సినిమాల్లో, స్నో వైట్ అండ్ ద హంట్స్ మ్యాన్, మార్షల్స్ లా, బ్లడీ కట్స్, బ్లడ్ డ్రైవ్, లెస్ మిసరెబుల్స్, గ్రీన్ ఫింగర్స్, ఈస్ట్ ఎండర్స్, హ్యాపీ హవర్స్, లవ్ వితౌట్ వాల్, బర్ద్స్ సారో చెప్పుకోదగ్గవి.
ఆయన నటించిన చివరి చిత్రం డంజిన్స్ అండ్ డ్రాగన్స్: హానర్ ఎమంగ్ థీవ్స్ 2023లో విడుదలైంది.
డారెన్ కెంట్ చాలారోజుల నుండి చర్మ సంబంధిత సమస్యతో బాధపడేవారు. సూర్యకిరణాలు అతని చర్మం మీద పడకూడదు. దానివల్ల కెంట్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినా కూడా సినిమాల్లో నటించి వినోదం పంచాడు.