తదుపరి వార్తా కథనం

Val Kilmer: హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్ కన్నుమూత
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 02, 2025
11:57 am
ఈ వార్తాకథనం ఏంటి
హాలీవుడ్ ప్రముఖ నటుడు వాల్ కిల్మర్ (Val Kilmer) ఏప్రిల్ 1, 2025న లాస్ ఏంజిల్స్‌లో 65 ఏళ్ల వయసులో మృతిచెందారు.
న్యూమోనియాతో బాధపడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కిల్మర్ 2014లో గొంతు క్యాన్సర్‌కు గురయ్యారు, కానీ చికిత్స తర్వాత కోలుకున్నారు.
1984లో 'టాప్ సీక్రెట్!' ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన కిల్మర్, 1986లో 'టాప్ గన్' చిత్రంలో టామ్ క్రూయిజ్‌తో కలిసి నటించి ప్రసిద్ధి పొందారు. 1991లో 'ది డోర్స్' చిత్రంలో జిమ్ మారిసన్ పాత్రను పోషించారు.
Details
విషాదంలో అభిమానులు
1995లో 'బ్యాట్‌మన్ ఫరెవర్'లో బ్రూస్ వెయిన్ పాత్రలో కనిపించారు.
కిల్మర్ 1989లో నటుడు జోయాన్ వాల్లీని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు మెర్సిడీస్, జాక్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. 1996లో ఈ జంట విడాకులు తీసుకుంది.
2022లో విడుదలైన 'టాప్ గన్: మావెరిక్' చిత్రంలో ఆయన చివరిసారిగా నటించారు.
మీరు పూర్తి చేశారు