NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Michelle Trachtenberg: అనుమానాస్పద స్థితిలో హాలీవుడ్ నటి మిచెల్ ట్రాచ్టెన్‌బర్గ్ మృతి
    తదుపరి వార్తా కథనం
    Michelle Trachtenberg: అనుమానాస్పద స్థితిలో హాలీవుడ్ నటి మిచెల్ ట్రాచ్టెన్‌బర్గ్ మృతి
    అనుమానాస్పద స్థితిలో హాలీవుడ్ నటి మిచెల్ ట్రాచ్టెన్‌బర్గ్ మృతి

    Michelle Trachtenberg: అనుమానాస్పద స్థితిలో హాలీవుడ్ నటి మిచెల్ ట్రాచ్టెన్‌బర్గ్ మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 27, 2025
    10:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హాలీవుడ్ నటి మిచెల్ ట్రాచ్టెన్‌బర్గ్ (39) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

    న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ అపార్ట్‌మెంట్‌లో అపస్మారకంగా పడి ఉన్న ఆమెను గుర్తించినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. మిచెల్ బాలనటిగా తన ప్రయాణాన్ని మూడేళ్ల వయసులోనే ప్రారంభించారు.

    'బఫీ ది వాంపైర్ స్లేయర్', 'గాసిప్ గర్ల్' వంటి ప్రసిద్ధ టీవీ సిరీస్‌లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెను అభిమానులు ముద్దుగా 'బఫీ' అని పిలుచుకునే వారు.

    బుధవారం ఉదయం మిచెల్ మృతిచెందినట్లు యూఎస్ మీడియా నివేదించింది.

    Details

    ఇటీవల కాలేయ మార్పడి చేయించుకున్న మిచెల్

    పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

    అయితే మృతికి గల కారణాలను ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఇటీవల మిచెల్ కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నట్టు సమాచారం.

    అభిమానులు సోషల్ మీడియాలో ఆమె ఆరోగ్యంపై ప్రశ్నించినా తాను ఆరోగ్యంగా ఉన్నట్లు మిచెల్ వెల్లడించారు. కానీ కాలేయ మార్పిడి విఫలమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

    ఈ ఘటన వెనుక ఎలాంటి కుట్ర లేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయింది.

    Details

    1996లో బాలనటిగా గుర్తింపు

    మిచెల్ 1996లో వచ్చిన 'హ్యారియెట్ ది స్పై' చిత్రంతో గుర్తింపు పొందారు.

    'బఫీ ది వాంపైర్ స్లేయర్' సిరీస్ ఆమె కెరీర్‌కు కీలక మలుపుగా మారింది. 2000 నుండి 2003 వరకు ఈ షోలో డాన్ పాత్రను పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.

    అనంతరం 2008 నుండి 2012 వరకు ప్రసారమైన 'గాసిప్ గర్ల్' సిరీస్‌లో సోషలైట్ విలన్ జార్జినా స్పార్క్స్ పాత్రను పోషించి మరింత గుర్తింపు పొందారు.

    బ్లేక్ లైవ్లీ, పెన్ బాడ్గ్లే, లైటన్ మీస్టర్ వంటి నటులతో కలిసి ఆమె ఈ ప్రాజెక్టులో పనిచేశారు. యూరోట్రిప్, 17 ఎగైన్, ది స్క్రిబ్లర్ వంటి సినిమాల్లోనూ ఆమె తన ప్రతిభను చాటుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హాలీవుడ్
    సినిమా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    హాలీవుడ్

    డిప్రెషన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఆస్కార్ నామినేటెడ్ సింగర్ కోకో లీ  సినిమా
    ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్: సమ్మె బాట పట్టిన హాలీవుడ్ రచయితలు, నటీనటులు  సినిమా
    హాలీవుడ్ సమ్మెకు ప్రియాంక చోప్రా సంఘీభావం; నెటిజన్ల ప్రశంసలు అమెరికా
    హాలీవుడ్ నుండి టాలీవుడ్ దాకా: ఈవారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాల లిస్టు  సినిమా

    సినిమా

    Tollywood: సినిమాల్లో అవకాశం పేరుతో మహిళపై లైంగిక దాడి.. అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్టు టాలీవుడ్
    Madhavi Latha: జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత ఫిర్యాదు టాలీవుడ్
    Abhinaya: వివాదాస్పద సీన్‌పై స్పందించిన నటి అభినయ టాలీవుడ్
    Upcoming Telugu Movies: ఈ వారం థియోటర్, ఓటిటిలో విడుదలవుతున్న చిత్రాలివే ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025