ఎన్టీఆర్ 30: హాలీవుడ్ నుండి టెక్నీషియన్లను దింపుతున్న కొరటాల, ఈసారి వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్టీఆర్ 30 సినిమా నుండి సాలిడ్ అప్డేట్స్ వస్తున్నాయి. హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఎంపిక కావడం, యాక్షన్ డైరెక్టర్ గా హాలీవుడ్ నుండి కెన్నీ బేట్స్ రావడం సహా తాజాగా మరో హాలీవుడ్ టెక్నీషియన్ ని రంగంలోకి దించుతున్నారు.
ఎన్టీఆర్ 30లో విజువల్ ఎఫెక్ట్స్ గ్రాండ్ గా ఉండాలని, హాలీవుడ్ సినిమాలకు పని చేసిన బ్రాడ్ మిన్నిచ్ ని ఆహ్వానిస్తున్నారు. ఆక్వామాన్, బ్యాట్ మాన్ వర్సెస్ సూపర్ మాన్, ద గుడ్ లార్డ్ బర్డ్ చిత్రాలకు బ్రాడ్ మిన్నిచ్ పనిచేసారు.
ఆల్రెడీ ప్రొడక్షన్ డిజైనర్ గా, బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు పనిచేసిన సాబు సిరిల్ ని తీసుకున్నారు. సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు పనిచేస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎన్టీఆర్ 30 కోసం హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్
#BradMinnich will be the VFX supervisor for crucial sequences in #NTR30 💥💥
— Yuvasudha Arts (@YuvasudhaArts) March 28, 2023
Get ready for a stunning visual treat on the Big Screens 🤩#NTR30Begins@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @NTRArtsOfficial pic.twitter.com/UZFuUcW2V4